షెడ్యూల్డ్‌ కులాలకు మూడు కార్పొరేషన్‌లు

25 Aug, 2019 20:40 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ మాల సంక్షేమ కార్పొరేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ మాదిగ సంక్షేమ కార్పొరేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ రెల్లి మరియు ఇతరుల సంక్షేమ కార్పొరేషన్‌ లిమిటెడ్‌

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: షెడ్యూల్డ్‌ కులాల వారికి మూడు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌ మాల సంక్షేమ కార్పొరేషన్‌’, ‘ఆంధ్రప్రదేశ్‌ మాదిగ సంక్షేమ కార్పొరేషన్‌’, ‘ఆంధ్రప్రదేశ్‌ రెల్లి మరియు ఇతరుల సంక్షేమ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు ముందు పలువురు షెడ్యూల్డ్‌ కులాల వారు చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించి కులాల వారీగా ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్‌ ఎస్సీ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీకి మూడు కార్పొరేషన్‌లకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. కాగా  బీసీల్లో 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఇంతేనా?

మా ఉద్యోగుల జోలికి రావొద్దు..

కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే

రెడ్‌క్రాస్‌ భోజన పంపిణి కార్యక్రమం

కరోనా: సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి విరాళం

సినిమా

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి

బ‌డా నిర్మాత కూతురికి క‌రోనా

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: కార్తీక్‌ ఆర్యన్‌