ఏఆర్వోలపై ఈసీ వేటు 

20 Apr, 2019 00:36 IST|Sakshi

మరో ముగ్గురు ఆర్వోలపై  అభియోగాలు నమోదు చేయాలి 

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా 

సాక్షి, అమరావతి : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మొత్తం 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి నాలుగు రోజుల క్రితం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. నూజివీడు, సూళ్లూరుపేట, కోవూరు ఆర్వోలపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించి.. ముగ్గురు ఏఆర్వోలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడమే కాకుండా సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. మరికొంతమంది అధికారులకు షోకాజ్‌ నోటీసులను జారీ చేసింది. త్వరలో మిగిలిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది.  

ఆ వార్తలతో సంబంధం లేదు: సీఈవో ద్వివేదీ 
ఈవీఎంలకు సంబంధించి ‘అధికారుల నిర్లక్ష్యమా, పెద్దల డైరెక్షనా?’అనే వార్త తో పాటు ‘మొరాయింపు కుట్ర’కథనం తో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు గానీ, తన కు గానీ, ఇతర అధికారులకు గానీ సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ శుక్రవారం పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు