నేడు అనూహ్య అంత్యక్రియలు

18 Jan, 2014 09:25 IST|Sakshi
నేడు అనూహ్య అంత్యక్రియలు

ముంబైలో దారుణహత్యకు గురైన అనూహ్య ఈస్తర్ మృతదేహం మచిలీపట్నానికి చేరుకుంది. శనివారం ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్న అనూహ్య.. క్రిస్మస్ సెలవలకు వచ్చి, తిరిగి వెళ్లి.. ఇంటికి చేరుకోకుండానే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అనూహ్యను బలమైన ఆయుధంతోనే కొట్టి చంపినట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు. ఆమె దేహంపై పలు చోట్ల గాయాలున్నాయని, మర్మావయవాలపైనా గాయాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అత్యాచారం జరిగిందా లేదా అనేది మాత్రం ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే తెలుస్తుందంటున్నారు.

ముంబై పోలీసులు కేసు దర్యాప్తులో తీవ్ర అలసత్వం ప్రదర్శించారని అనూహ్య తండ్రి ప్రసాద్ చెప్పారు. ఎంతసేపూ ఆమెకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారే తప్ప.. ఎవరైనా దుండగులు ఆమెపై దాడి చేశారా అనే కోణంలో ఆలోచించలేదని ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే ఈ కోణంలో దర్యాప్తు చేసి ఉంటే తమ కుమార్తె తమకు దక్కి ఉండేదని, ఇప్పుడిలా మృతదేహంలా చూసుకోవాల్సి వస్తోందని కన్నీళ్ల పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు