ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా తీర్మానం

18 Jun, 2020 03:46 IST|Sakshi

మార్చి 4న చేసిన కేబినెట్‌ తీర్మానానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది 

ఎన్‌పీఆర్‌పై ముస్లింలలో భయాందోళనలు

పాత ఫార్మాట్‌నే అమలు చేయాలి..

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా

సాక్షి, అమరావతి: జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. గతంలో ప్రకటించిన విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఎన్‌పీఆర్‌లో కేంద్రం కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళన నెలకొని ఉందని పేర్కొంది. 2010 నాటి ఫార్మాట్‌ అమలు చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..

► కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలపై ముస్లింలలో అభద్రతా భావముంది.
► రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలోనూ ఎన్‌పీఆర్‌ను అమలు చేయబోమని సీఎం వైఎస్‌ జగన్‌ గతంలో స్పష్టం చేశారు.
► ఎన్‌పీఆర్‌లో కొన్ని కాలమ్స్‌ ముస్లింలకు ఆందోళన కలిగించేవిగా, భయపెట్టేవిగా ఉన్నాయి.
► తల్లిదండ్రుల వివరాలు, పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతో పాటు మాతృభాషకు సంబంధించి కొన్ని అభ్యంతరాలున్నాయి.
► 2010లో ఎన్‌పీఆర్‌ నిర్వహించారు. అయితే ఇప్పుడు నిర్వహిస్తున్న ఫార్మాట్‌లో అభ్యంతరాలున్నాయి.
► 2010 ఫార్మాట్‌ ప్రకారమే ఎన్‌పీఆర్‌ను కొనసాగించాలని తీర్మానంలో చెప్పాం.
► మార్చి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా తీర్మానం చేశాం. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముస్లింలకు భరోసా వచ్చింది.

>
మరిన్ని వార్తలు