అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక మార్గదర్శకాలు

14 Jun, 2020 14:28 IST|Sakshi

ఏపీ అసెంబ్లీ కార్యదర్శి

సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలకు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. సమావేశాలు జరిగేటప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిబ్బందని వెంట తీసుకురావద్దని అసెంబ్లీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక బులెటిన్‌ను విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సభ్యులంతా కచ్చితంగా భౌతికదూరం పాటించాల్సిందేనని నిబంధనలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీలోకి అనుమతి ఉంటుదని తెలిపారు. కారు పాస్ ఖచ్చితంగా వాహనాలకు అతికించాలని స్పష్టం చేశారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. (అచ్చెన్నకు మా ఉసురే తగిలింది)

గుర్తు తెలియనివారికి అసెంబ్లీలోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు. అలాగే గన్‌మెన్లను, విజిటర్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక అసెంబ్లీలోకి ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దని సభ్యులకు ఆదేశాలు జారీచేశారు. బ్యానర్లు, ఫ్లకార్డ్స్, కర్రలు, స్ప్రేలు వంటివేవీ అనుమతించమని, అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదన్నారు. సభ్యులు తమవెంట పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌ఓలను తీసుకురావొద్దని కోరారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. (కార్మికుల ఉసురు తీశారు)

మరిన్ని వార్తలు