యనమలకు మంత్రి బొత్స సవాల్‌

21 Jan, 2020 11:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజు వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం శాసనమండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతివ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలకు బొత్స ఫోన్‌ చేసి ప్రలోభాలకు గురిచేశారని యనమల ఆరోపించారు. అయితే యనమల తీరుపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దమ్ముంటే ఏ ఎమ్మెల్సీకి ఫోన్‌ చేశామో నిరూపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు.  

ఈ సందర్భంగా బిల్లుకు సమయం కావాలని యనమల ఆడగడంపై మంత్రి బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలని, బిల్లు పెట్టి గంటలో చర్చ చేపట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా టీడీపీకి ఇష్టం వచ్చినట్లు సభా నడపాలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో రాజధాని అంశంపై బొత్స మాట్లాడినట్లుగా వచ్చిన వార్తలను యనమల చదివి వినిపించారు. అయితే టీడీపీ పార్టీ పాంప్లెట్‌గా పనిచేసే పత్రికలను సభలో ఎలా చదువుతారని మంత్రి బొత్స తప్పుపట్టారు.  

చదవండి: 
ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?

సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం

సంక్షేమ పథకాలు వదిలేద్దామా!

ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా?

వికేంద్రీకరణకు కేబినెట్‌ ఆమోదం

మరిన్ని వార్తలు