మరిన్ని హామీల అమలే లక్ష్యంగా..

16 Oct, 2019 04:32 IST|Sakshi

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ భేటీ

సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలులో శరవేగంగా దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలోని మరిన్ని అంశాల అమలుకు రంగం సిద్ధంచేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతోంది. సచివాలయంలో ఉదయం 11గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. చర్చించే అంశాలివీ...
►రాష్ట్ర  ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా రూ.46,675 కోట్ల వ్యయంతో భారీ వాటర్‌ గ్రిడ్‌.  
►మగ్గం ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలకు ఏడాదికి రూ.24వేల చొప్పున డిసెంబర్‌ 21న ఆరి్థక సాయం అందించేందుకు విధివిధానాలు.  
►ఇసుక రవాణాకు సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 6000 వాహనాలను ఆయా వర్గాల యువతకు సమకూర్చడం.  
►ఔట్‌ సోర్సింగ్‌లో దళారీ వ్యవస్థను నిర్మూలించి రాష్ట్రస్థాయిలో డిసెంబర్‌ 1 నుంచి కార్పొరేషన్‌ ఏర్పాటు.  
►జనవరి 26 నుంచి జగనన్న అమ్మ ఒడి పథకం అమలు.  
►చిరు ధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించేందుకు, ఆ పంటలకు గిట్టుబాటు ధర కలి్పంచేందుకు వీలుగా ప్రత్యేకంగా బోర్డు. దీనితోపాటు పప్పు, వరి ధాన్యాల బోర్డులు.  
►గ్రామ న్యాయాలయాలు, ఉన్నత విద్య, స్కూలు విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల సభ్యుల నియామకాలు..  
►రోబో ఇసుక తయారీ.  
►ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం రూ.50కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకం.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెజవాడ విద్యార్థికి ‘గిన్నిస్‌’లో స్థానం 

పల్లెకు పైసలొచ్చాయ్‌...! 

‘కరోనా’ వెబ్‌సైట్లు ఓపెన్‌ చేయొద్దండి

హోం క్వారంటైన్‌లో స్విమ్స్‌ వైద్యుడు

సరిహద్దులో శత్రువు 

సినిమా

ఆ సినిమా చూడండి వైరస్‌ వ్యాప్తి అర్ధమవుతుంది

రాధిక ఆప్టేకు క‌రోనా క‌ష్టం..

సూపర్‌స్టార్‌కు దీటుగా ఇళయ దళపతి? 

కరోనా విరాళం

వాయిస్‌ ఓవర్‌

ఐటీ మోసగాళ్ళు