గవర్నర్‌ను కలిసిన సీఈవో ద్వివేది

26 May, 2019 12:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితోపాటు అడిషనల్ సీఈఓలు వివేక్‌ యాదవ్‌, సుజాత శర్మలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల జాబితాతో కూడిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు అందజేశారు. భేటీ అనంతరం ద్వివేది మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికైన 175 మంది జాబితాను గవర్నర్‌కు అందజేసామన్నారు. ఎన్నికల ప్రక్రియలో చివరి అంకంలో భాగంగా ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అంజేసినట్టు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంపై గవర్నర్‌ కితాబు ఇచ్చినట్టు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు