పవన్‌ సుడో సెక్యులరిస్టు..

7 Dec, 2019 16:53 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్‌ క్రిస్టియన్‌ లీడర్ల ఫోరం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలు ఉన్నాయని క్రిస్టియన్‌ నేతలు పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఫోరం తప్పుబట్టింది. పవన్‌ సుడో సెక్యులరిస్టుగా మాట్లాడుతున్నారన్నారు.  ప్రభుత్వంపై బురదచల్లేందుకే పవన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పలు విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల తిరుపతిలో పర్యటించిన పవన్‌ కళ్యాణ్‌ మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారు. తిరుపతిలో అన్యమత ప్రచారం పెరిగిపోయిందంటూ ఒక మతాన్ని కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. విజయవాడ పున్నమి ఘాట్‌లో మత మార్పిడిలు జరుగుతున్నాయంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీవారే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా