ఏపీ చరిత్రలో తొలిసారి.. సీఎం గైర్హాజరు

26 Jan, 2018 12:48 IST|Sakshi
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జెండా ఎగరేసిన గవర్నర్‌, వేడుకకు హాజరైన సీఎం సతీమణి భువనేశ్వరి, మనుమడు దేవాన్ష్‌.

ముఖ్యమంత్రి లేకుండా గణతంత్ర వేడుకలు..

సాక్షి, విజయవాడ : గణతంత్ర వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ నరసింహన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక సీఎం జాతీయ పండుగలో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మంత్రులతోపాటు సీఎం సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌లు వేడుకలో భాగం పంచుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆలస్యంగా.. ఏపీలో ప్రధాన జెండా పండుగ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం ఎక్కడ? : దావోస్‌ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం ఉదయానికల్లా విజయవాడకు చేరుకుని, గణతంత్ర వేడుకల్లో పాల్గొనాల్సిఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణించాల్సిన విమానం ఆలస్యమైందని, దీంతో ఆయన అబుదాబీలోనే ఆగిపోయారని తెలిసింది. సాయంత్రం 4 గంటలకుగానీ సీఎం విజయవాడ చేరుకునేఅవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం వెంట ఆయన తనయుడు లోకేశ్‌, ఇతర ముఖ్యులు ఉన్నారు. గణతంత్ర వేడుకలకు సీఎం గైర్హాజరుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

>
మరిన్ని వార్తలు