2014లో ఎవరు అడుక్కున్నారు?

5 Feb, 2019 01:47 IST|Sakshi
ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో కలసి మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు  అమిత్‌ షాకు చంద్రబాబు ప్రశ్న

అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేశానని వివరణ

తన సామాజికవర్గానికి చెందిన  సీఐలకు పదోన్నతులు ఇవ్వడంపై స్పందించని వైనం

సాక్షి, న్యూఢిల్లీ: 2014 ఎన్నికల్లో పొత్తు కోసం బీజేపీ నేతలు ఎవరి దగ్గరకొచ్చి అడుక్కున్నారో గుర్తుంచు కోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చినా తాము రానివ్వబోమని, డోర్లు మూసేశామని బీజేపీ జాతీయ అధ్యక్షు డు అమిత్‌ షా విజయనగరం పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బాబు పై విధంగా స్పందించారు. సోమవారం చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మా ట్లాడుతూ.. ‘ఆయన్ను అడుక్కునేవారు ఎవరూ లేరు. 2014లో ఎవరు ఎవరి దగ్గరకొచ్చి అడుక్కు న్నారో ఆయన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోని బీజేపీకి ప్రజలే డోర్లు మూసేస్తారు. ఇంత అహంకారపూరితంగా మా ట్లాడం సరికాదు. 2014లో ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన చరిత్ర ఏంటి? అలాంటి విషయాలు చెబితే చాలా ఉంటాయి. మీరు రాష్ట్రానికి ఏం చేశారు అనేది చెప్పకుండా బెదిరిస్తే భయపడం’ అన్నారు. రాష్ట్రం లో కులాల మధ్య చిచ్చుపెట్టే పరిస్థితులు రావడం దారుణమని వ్యాఖ్యానించారు. తన మంత్రివర్గంలో నలుగురు రెడ్లు ఉన్నారని, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగిందని ప్రశ్నించారు. కానీ రాష్ట్రంలో తన సామా జికవర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా పదోన్న తులు ఇవ్వడం, ఒక లా అండ్‌ ఆర్డర్‌ కోఆర్డి నేషన్‌ పోస్టును ఏర్పాటు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ చేసిన ఫిర్యాదుపై మాత్రం చంద్రబాబు స్పందించక పోవడం గమనార్హం. 

మమత దీక్షకు సంఘీభావం : కాగా, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ నివాసం లో చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, టీఎంసీ ఎంపీ డేరెక్‌ ఓబ్రెయిన్‌లు సమావేశమయ్యారు. కోల్‌కతాలో సీబీఐ దాడులకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు సంఘీ భావం తెలుపుతున్నట్టు సమావేశం అనంతరం నేతలు మీడియాకు తెలిపారు. ‘వ్యవస్థలను బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంటోంది. దేశంలో నాయకత్వాన్ని అణచివేస్తున్నారు. మమత, ఫరూక్, శరద్‌ పవార్‌లు నా కంటే సీనియర్లు.వారిని కూడా వేధిస్తే మేమంతా ఎక్కడికి వెళ్లాలి? ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఇలాగే దాడులు చేయిం చి ఉంటే, వీరందరినీ జైల్లో పెట్టి ఉంటే ఇప్పుడు వీరు వచ్చేవాళ్లా?’ అని బాబు ప్రశ్నించారు. 23 పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడంపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం బ్యాలెట్‌ ఓటింగ్‌ పెట్టాలని ఈసీని కోరామన్నారు.

మరిన్ని వార్తలు