పెనుమాకలో రాజన్న బడిబాట కార్యక్రమం

14 Jun, 2019 10:59 IST|Sakshi

 ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రభుత్వం ప్రణాళిక    

 ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చడమే లక్ష్యం

  పెనుమాకలోని వందేమాతరం పాఠశాలలో రాజన్న బడిబాట నిర్వహణ

  హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శుక్రవారం తాడేపల్లి మండలం పెనమాకలోని వందేమాతరం హైసూల్క్‌లో ఒకేసారి 2వేలమంది విద్యార్థుల సామూహిక అక్షరాభాస్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన సరస్వతి దేవి పటానికి అంజలి ఘటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పలువురు చిన్నారులను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అక్షరాభ్యాసం చేయించి, అమ్మ ఒడిని చల్లగా దీవించారు. ఆ తర్వాత విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ...
సర్కార్‌ పాఠశాలల్లో అనేక వసతులు కల్పించడంతో తల్లిదండ్రులు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. ప్రాథమిక విద్య 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ హైస్కూల్‌కు పంపిస్తున్నారు. ఈ ఏడాది స్కూల్‌ ప్రారంభించేనాటికే విద్యార్థులకు సంబంధించి 19.85 లక్షల పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు యూనిఫాం అన్ని పాఠశాలలకు చేరింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, 2,51,601 మంది బూట్లు, రెండు జతల సాక్సులు అందిస్తున్నారు. 8, 9 తరగతులు చదివే బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు