-

కొత్త ఏడాదిలో తొలి కార్యక్రమం అదే: సీఎం జగన్‌

31 Dec, 2019 14:17 IST|Sakshi

జనవరి 1న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం

2059 రోగాలకు ఆరోగ్య శ్రీ వర్తింపు

ఫిబ్రవరి నుంచి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు

ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం చెల్లింపు

స్పందనపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : స్పందనపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఇళ్ల పట్టాల పంపిణి వంటి కీలక పథకాలు లబ్దిదారులకు ఖచ్చితంగా చేరాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవలకు చోటు ఇవ్వకూడదని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన సంవత్సరంలో జనవరి 1న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుతుందని సీఎం గుర్తుచేశారు. కొత్త ఏడాదిలో ఇదే తొలి కార్యక్రమం అని వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందనపై అధికారులు నిర్దేశం చేశారు. కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. కొత్తగా  2059 రోగాలకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

‘స్పందనలో వస్తున్న విజ్ఞాపన పత్రాలు పరిష్కారంలో నాణ్యతకోసం ఇప్పటికే మనం విధానాలను ఏర్పాటు చేసుకున్నాం. వివిధ పథకాలకు సంబంధించి లబ్ధి దారుల ఎంపిక, సోషల్‌ ఆడిట్‌ తయారుచేయాలి. వైఎస్సార్‌ నవశకానికి సంబంధించి ఇళ్లపట్టాలు, పెన్షన్లు, రేషన్‌కార్డులకు సంబంధించి దాదాపు 60 శాతం దరఖాస్తులు వస్తున్నాయి. ఈ మూడు అంశాల మీద అర్హతలు, అర్హులైన వారి జాబితాలు, సోషల్‌ఆడిట్‌ తదితర విషయాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే చేయాలి. కొత్తరేషన్‌ కార్డులు, కొత్త పెన్షన్లు ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ చేయాలి. మనకు ఓటు వేయనివారు కూడా అర్హులైతే పథకాన్ని వర్తింపు చేయాలి. కొత్తగా అర్హులైన వారి జాబితాలను వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడికి సంబంధించి అర్హుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం డిస్‌ప్లే చేస్తున్నాం. అధికారులు అర్హతలను కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే చేయండి. రైతు భరోసా, అమ్మ ఒడి, ఇళ్లపట్టాలు, రేషన్‌ కార్డులు, పెన్షన్లు సహా పథకాలకు సంబంధించి అర్హతలను, జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్రాంతి నాటికి ప్రదర్శించాలి. 

2059 రోగాలకు ఆరోగ్ర శ్రీ వర్తింపు..
జనవరి 1న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఈ ఏడాది తొలి కార్యక్రమం ఇదే. ప్రజా ప్రతినిధులు డిపోల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలి. దాదాపు 50వేలకు పైగా ఉన్న కుటుంబాల దీర్ఘకాలిక కలను నెరవేర్చాం. జనవరి 3న కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభ. ఫిబ్రవరి మాసం చివరి నాటికి 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ. జనవరి 3న 1.5 లక్షల పంపిణీ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు జనవరి 3న పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభిస్తాం. 2059 రోగాలకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలి. మిగతా జిల్లాల్లో 1259 రోగాలకు ఆరోగ్య శ్రీ సేవలు పెంచాలి. ఏప్రిల్‌ నుంచి ఒక్కో జిల్లాకు పెంచుతూ 2059 రోగాలకు పెంపు. ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ కింద సేవలు తలసేమియా, సికిల్‌ సెల్‌ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10వేల చొప్పున పెన్షన్‌ అమలవుతుంది. మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, కండరా క్షీణతతో బాధపడుతున్నవారికి నెకు రూ.5వేల చొప్పున పెన్షన్‌. కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి రూ. 3వేల పెన్షన్‌.  జనవరి 2న రైతు భరోసాకు సంబంధించి చివరి విడత డబ్బు పంపిణీ చేయాలి. 46,50,629 రైతు కుటుంబాలకు ఈ డబ్బు పంపిణీ. గ్రామ వాలంటీర్లు జనవరి 3న లబ్దిదారుల ఇంటికి వెళ్లి లేఖలు ఇవ్వాలి. రశీదు కూడా తీసుకోవాలి. రైతు భరోసాకు సంబంధించి లబ్ధిదారుల జాబితా కూడా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. వచ్చే ఖరీఫ్‌ నాటికి మళ్లీ రైతు భరోసా కింద డబ్బులు ఇస్తాం.  జనవరి 9న అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభమవుతుంది. సోషల్‌ ఆడిట్‌ తర్వాత జనవరి 2న తుది జాబితా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ 81,72,224 మంది పిల్లల డేటా పరిశీలన చేయాలి. 

జనవరిలో ప్రత్యేక కార్యక్రమాలు..
జనవరి 4 నుంచి స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. తల్లిదండ్రులను, తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగాలి.  జనవరి 4,6,7,8 తేదీల్లో దీనిపై అవగహాన కార్యక్రమాలు చేపట్టాలి. 1న అమ్మ ఒడి. 2న సంక్రాంతి తర్వాత మధ్యాహ్న భోజనంలో తీసుకొస్తున్న మార్పులు– నాణ్యతతో కూడిన ఆహారం దీనికి రూ.200 కోట్లు ఖర్చు కూడా చేస్తున్నాం. 3న ఇంగ్లీషు మాధ్యంపైన, దీన్ని ఏరకంగా స్కూళ్లలో తీసుకు వస్తున్నాం, చేపట్టబోయే బ్రిడ్జి కోర్సులు, టీచర్లకు ఇస్తున్న శిక్షణ. 4 నాడు – నేడు పైన ఈ నాలుగు అంశాలపైన ఈ నాలుగు రోజుల్లో తల్లిదండ్రులకు, విద్యా కమిటీలకు, పిల్లలకు అవగాహన కల్పించాలి. 9న అమ్మ ఒడి కార్యక్రమాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీలతో కలిపి నిర్వహించాలి. స్థానిక ప్రజా ప్రతినిధులందర్నీకూడా భాగస్వామ్యం చేయాలి. అమ్మ ఒడి కార్యక్రమం దేశంలో ఎక్కడా చేయలేదు. మనం చేస్తున్నకార్యక్రమాలు విద్యారంగం ముఖచిత్రాన్ని మారుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యాకమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలి. 

రైతుల ఆత్మహత్యలకు పరిహారం..
2014 నుంచి 2019 జూన్‌ వరకూ 566 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారులు అన్నింటినీ పరిశీలించి 566 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. 2014 నుంచి ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ఎలాంటి సహాయం అందించని రైతుల కుటుంబాలను పిలిపించి రూ.5 లక్షల చొప్పున ఫిబ్రవరి 12న వారికి పంపిణీ చేయాలి. గతంలో వీరికి రూ.5 లక్షలు ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం ఎగ్గొట్టింది. 2019 జూన్‌ నుంచి ఈ డిసెంబర్‌ వరకూ కూడా ఎవరైనా రైతులు బలవన్మరణానికి పాల్పడితే కలెక్టర్ల్, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలని మార్గదర్శకాలు మనం రూపొందించాం. అయినా సరే వారికి పరిహారం అందని పరిస్థితి కనిపిస్తోంది. కోటి రూపాయలు ప్రతి కలెక్టర్‌ వద్ద పెట్టినప్పటికీ తాత్సారం వల్ల ఇంకా చాలా మందికి డబ్బులు అందని పరిస్థితి ఉంది. 121 మంది ఆత్మహత్య చేసుకుంటే అందులో చాలామందికి డబ్బులు అందలేదు. ఈ కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. ఈ డబ్బుమీద అప్పులు వాళ్లకి, బ్యాంకులూ ఎలాంటి క్లెయిం చేయకూడదు. కలెక్టర్లు వద్ద డబ్బు అయిపోతే వెంటనే అడగాలి. ఏదైనా రైతు కుటంబానికి జరగరానిది జరిగితే.. వారంరోజుల్లోగా కలెక్టర్లు స్పందించాలి. ఈ విషయంలో మానవీయతతో ఉండాలని పదేపదే విజ్ఞప్తిచేస్తున్నాం.

రైతు భరోసా కేంద్రాలు
ఫిబ్రవరి 1న రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం11,150 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏప్రిల్‌ నాటికి మొత్తం కేంద్రాలు వచ్చే ఖరీఫ్‌నాటికి ఈ కేంద్రాలన్నీ ప్రారంభం కావాలి. వీటికోసంఎక్కడెక్కడ భనాలు, స్థలాలు కావాలో వెంటనే గుర్తించాలి. ఫిబ్రవరి 1న 3,300 రైతు భరోసా కేంద్రాలు తొలిదశలో ప్రారంభం. వ్యవసాయరంగంలో సమూల మార్పులు సిద్ధిస్థాయినాణ్యతో కూడి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఈ కేంద్రాల్లో గ్యారెంటీతో లభిస్తాయి.  భూసార పరీక్షలు కూడా చేస్తారు. రైతుల ఉత్పత్తులకు కొనుగోలు కూడా ఈ భరోసా కేంద్రాల ద్వారానే భవిష్యత్తులో జరుగుతుంది. అలాగే విత్తన పంపిణీ కూడా జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం పైన కూడా రైతులకు అవగాహన, శిక్షణ లభిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను ఈ కేంద్రాలు బలోపేతం చేస్తాయి. ఉత్తమ సాగు యాజమాన్య పద్ధతులు రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. రైతు భరోసా కేంద్రాలను విజయవంతం చేయాలి. ఇళ్లపట్టాలు ఉగాది నాటికి ఇస్తామని ఇప్పటికే ప్రకటించాం. ఇప్పటివరకూ 22,76,420 మంది లబ్ధి దారుల గుర్తింపు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించామన్న అధికారులుఇంకా 15వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది. కలెక్టర్లు మరింత ఉద్ధృతంగా పనిచేయాల్సి ఉంటుంది. ఉన్న సమయం కేవలం రెండు నెలలు, ఈ సమయంలోగా మొత్తం భూముల గుర్తింపు, సేకరణ పూర్తి కావాలి. ప్రతిజిల్లాలో కనీసం మూడు సార్లు పర్యటించాలి’ అని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు