కియా ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

5 Dec, 2019 13:06 IST|Sakshi

సాక్షి, అనంతపురం: పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కియా మోటర్స్‌ ప్లాంట్‌ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కియా మోటర్స్‌ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కియా మోటార్స్‌ బాటలోలో మరికొన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు. ‘పెనుకొండలో కియా ఫ్యాక్టరీని ప్రారంభించటం సంతోషంగా ఉంది. కియా కార్ల పరిశ్రమ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఏర్పాటు కావటం శుభపరిణామం. కియా యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏపీలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు కియా సంస్థ ను అభినందిస్తున్నా’ అని అన్నారు.

ఎందరికో ఉపాధి
రాష్ట్రంలో కియా మోటర్స్‌ చక్కగా పని చేస్తుందన్న ముఖ్యమంత్రి సంస్థ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడితే ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా మరో 7 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇక్కడి సంస్థలో ఇప్పటికే 3 వేల మంది పని చేస్తుండగా, అనుబంధ విభాగాల ద్వారా మరో 3500 మందికి ఉపాధి లభిస్తోందని గుర్తు చేశారు.

మరింత విస్తరించాలి
కియా కంపెనీలో ఇప్పటికే ఏటా 70 వేల వాహనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతుండగా, సంస్థ మరిన్ని ప్లాంట్లు, విభాగాలు ప్రారంభించాలని సీఎం ఆకాంక్షించారు. కియా సంస్థ ఏటా 3 లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి చేరాలన్న ఆయన, తద్వారా ఇంకా ఎందరికో ఉపాధి లభిస్తుందని అన్నారు.

పూర్తి అండగా నిలుస్తాం
కియా సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందని, ఆ కంపెనీకి సానుకూలంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారు. తమది ప్రొయాక్టివ్‌ ప్రభుత్వం అని ఆయన వివరించారు.

కియా కార్లకు ఇక్కడ మంచి ఆదరణ ఉందన్న సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ హాన్‌ఊపాక్, ఒకేరోజు ఆరు వేలకు పైగా బుకింగ్స్‌ వచ్చాయని చెప్పారు. భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్‌ బాంకిన్, కియా మోటర్స్‌ ఎండీ కోకిన్‌షిన్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, .గౌతమ్‌రెడ్డి, శంకరనారాయణ, జయరాం, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎమ్మెల్యే, మండలి విప్‌ కాపు రామచంద్రారెడ్డితో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు,  కియా మోటర్స్‌ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతకుముందు పరిశ్రమలోని అన్ని విభాగాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కియా ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ చిత్రాన్ని ఆయన వీక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో ఏపీలో కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా సంస్థ కియా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రూ.13500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పవన్‌ వ్యాఖ్యలపై నటుడు సుమన్‌ ఫైర్‌

ఏం మాట్లాడుతున్నాడో పవన్‌కే తెలియదు?

సిగ్నల్‌ పడింది.. పాయింట్‌ తప్పింది

ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టి.. నిద్రపోయావా?

ఇంటి నుంచే ‘మార్పు ’ప్రారంభం కావాలి

కియా ఫ్యాక్టరీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌..

పవన్‌ ఉన్నాడంటూ ఓవర్‌ యాక్షన్‌..

అయ్యో..పాపం

చలానాతో.. పోయిన బైక్‌ తిరిగొచ్చింది!

‘రాజధాని పేరుతో అంతర్జాతీయ కుంభకోణం’

‘ఆయన టైంపాస్‌ చేస్తున్నారు’

ఆరోగ్యశాఖలో సిబ్బందిపై లైంగిక వేధింపులు...!

పిఠాపురంలో టీడీపీకి షాక్‌

నేటి ముఖ్యాంశాలు..

లైంగిక దాడి కేసులో భర్త, అతని స్నేహితుడి అరెస్ట్‌

బెజవాడలో బెట్టింగ్‌ ముఠా అరెస్టు

బాలిక గొంతు కోసి ఆపై..

భారీగా పెరిగిన పోలీసుల బీమా

‘కరెంట్‌ షాక్‌’లకు స్వస్తి!

ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులే టాప్‌

కడప స్టీల్‌ ప్లాంట్‌కు 23 లేదా 24న సీఎం శంకుస్థాపన

మహిళల రక్షణ కోసం కొత్త చట్టం

సాగరమంతా సంబరమే!

9.50 లక్షల ఎకరాల్లో  గోదా‘వరి’!

‘సీమ’ ఇంట.. రెండో పంట

మరే తల్లి, తండ్రికీ ఈ వేదన మిగలకూడదు

దారుణం : మహిళపై యాసిడ్‌ దాడి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి : మిథున్‌ రెడ్డి

రెల్లి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ల నియామకం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆన్‌లైన్‌ గ్రీకు వీరుడు హృతిక్‌!

విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టం: హీరోయిన్‌

బిగ్‌బాస్‌: కొట్టుకున్నారు.. ఆపై ఏడ్చాడు!

నగ్నంగా ఫొటో దిగడానికి తిరస్కరించిన నటి

డెంగీతో బాధపడుతూ నటించాను..

రొమాంటిక్‌కి గెస్ట్‌