సీఎంతో ఇజ్రాయిల్‌ రాయబారి చర్చలు 

25 Jul, 2019 11:39 IST|Sakshi

సాక్షి, అమరావతి : భారత్‌లో ఇజ్రాయిల్‌ రాయబారి రాన్‌మల్కా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహుకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఏపీతో ఇజ్రాయిల్‌ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఇజ్రాయిల్‌ నుంచి పెట్టుబడులు, నీటి సంరక్షణతో పాటు.. నీరులేని ప్రాంతాల్లో సముద్రపు నీటిని డిశాలినేషన్‌ చేసే అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. వృధా నీటిని తిరిగి వినియోగించే అంశం వీరి చర్చల్లో ప్రస్తావనకొచ్చింది.

ఇజ్రాయిల్‌కు చెందిన సాంకేతిక సంస్థలతో భాగస్వామ్యంపైనా సీఎంతో చర్చించారు. ఇటీవల గణనీయంగా పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను అరికట్టడంలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంపైనా సీఎంతో ఇజ్రాయిల్‌ రాయబారి మాట్లాడారు. దీంట్లో భాగంగా పోలీసు అధికారుల బృందాన్ని ఇజ్రాయిల్‌కు ఆహ్వానిస్తున్నట్టు రాన్‌మల్కా చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ విజన్‌ పట్ల తాను ఆకర్షితుడైనట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఇజ్రాయెల్‌ పొలిటికల్‌ సెక్రటరీ నోవా హకీమ్‌, ఇండో-ఇజ్రాయెల్‌ చాంబర్‌ ఆప్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మాజీ అధ్యక్షుడు ఉదయ్‌కేన్‌, సీఎం ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేష్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు