కోవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

8 Apr, 2020 14:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తయారైనా కోవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో  జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి రజత్‌ భార్గవ్‌ ఇతక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: ‘దేశంలో ఒక్క ఏపీలోనే వాటి తయారీ’

కాగా.. రాష్ట్రంలో తాజాగా మరో 15 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 329కు చేరింది. కొత్తగా నమోదైన 15కేసుల్లో నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు