కియా మోటర్స్‌ గ్రాండ్ ఓపెనింగ్‌లో సీఎం జగన్‌

5 Dec, 2019 12:33 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెనుకొండలో గల కియా ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కియా ఫ్యాక్టరీకి చేరుకున్న సీఎం.. ఈ సందర్భంగా కియా యాజమాన్యంతో సమావేశం అయ్యారు. పరిశ్రమ గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలోని అన్ని విభాగాలను సీఎం పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కియా ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ చిత్రాన్ని జగన్‌ వీక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో ఏపీలో కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా సంస్థ కియా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రూ.13500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం అనంతరం అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై  సీఎం ఆరా తీయనున్నారు. అలాగే అనంతపురం-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పై చర్చించే అవకాశాలు ఉన్నాయి. కాగా సోమందేపల్లి మండలం గుడిపల్లిలో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ పరిశ్రమకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇదివరకే  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరవాహన్ సంస్థ కు 120 ఎకరాల భూములు కేటాయింపు కూడా పూర్తి అయ్యాయి.


కియా ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గౌతంరెడ్డి, శంకర్ నారాయణ, గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్భాల్, మాజీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, గుర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు