ఉప ముఖ్యమంత్రి స్థానానికి ఎసరు?

13 Mar, 2019 11:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో అధికార టీడీపీలో సీట్ల కుమ్ములాటలు రోజురోజూకి పెరుగుతున్నాయి. ఓవైపు పార్టీకి చెందిన కీలక నేతలు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరుతుంటే.. మరోవైపు చంద్రబాబు నాయుడు సీనియర్‌ నేతల స్థానాలకే ఎసరుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి స్థానంలో ఐటీ మంత్రి లోకేష్‌ను పోటీ చేయించేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండడంతో ఆయన పార్టీ నేతలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప సీటు చర్చనీయాంశమైంది.
అందుబాటులో లేకుండా పోయిన ఏపీ మంత్రి..!

ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దాపురం స్థానాన్ని బొడ్డు భాస్కర రామారావుకు కేటాయిస్తారని విస్రృతంగా ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో బొడ్డు భాస్కర్‌ను వెంటనే అమరావతి రావల్సిందిగా చంద్రబాబు కబురు పంపడం.. చిన్న రాజప్ప వర్గాన్ని తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఉప ముఖ్యమంత్రికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారంటూ అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సీరియస్‌గా స్పందించిన చిన్నరాజప్ప సీటుపై చర్చించేందుకు చంద్రబాబుతో భేటీకి ప్రయత్నం చేస్తున్నారు.
‘పెద్దాపురం నుంచే పోటీ చేస్తా’  

మరిన్ని వార్తలు