ఫిర్యాదులపై సీఈసీకి వివరణ ఇచ్చుకున్న డీజీపీ..!

5 Apr, 2019 11:56 IST|Sakshi

న్యూఢిల్లీ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సీఈసీ కమిషనర్లు అశోక్‌ లావాస, సుళీల్‌ చంద్రతో భేటీ అయ్యారు. ఇంటలిజెన్స్‌ డీజీగా బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ ఏబీ వెంకటేశ్వరరావు అనధికారికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఠాకూర్‌ను ఈసీ వివరణ అడిగినట్టు తెలిసింది. ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహిరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఠాకూర్‌ను ఏసీబీ డీజీ పదవి నుంచి తప్పించి గట్టి హెచ్చరికలు పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏసీబీ ఏడీజీగా ఉన్న శంకబ్రత బాగ్చీకి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసింది.

(చదవండి : ఏసీబీ బాధ్యతల నుంచి ఠాకూర్‌ తొలగింపు)

మరిన్ని వార్తలు