భానుడి ప్రతాపం: తీసుకోవలసిన జాగ్రత్తలు

21 May, 2020 17:25 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గడిచిన రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న మూడు రోజులపాటు వేడి గాలులతో పాటు ఎండ మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్ ప్రకటించింది. ఎండ తీవ్రత ఎక్కువగా పెరుతుండటంతో ప్రజలకు పలు సూచనలు, సలహాలు చేసింది. (తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు)

ఎండ తీవ్రంగా ఉన్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

చేయవలసినవి

వేడిగా ఉన్న రోజులలో తప్పనిసరిగా గొడుగు వాడాలి
▶ తెలుపురంగు గల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి
▶ నెత్తికి టోపీ, లేదా రుమాలు పెట్టుకోవాలి
▶ ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజు నీరు తాగొచ్చు లేదా ఓరల్ రి హైడ్రేషన్ ద్రావణము తాగొచ్చు
▶ వడదెబ్బకు గురైనవారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చి తడిగుడ్డతో శరీరమంతా తూడవాలి
▶ వడదెబ్బకు గురి అయినవారిలో మంచి మార్పులు లేనిచో శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి
▶ మంచి నీరు ఎక్కువగా గాలి
▶ ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసుమంచి నీరు తాగాలి
▶ ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసముగాని, కొబ్బరి నీరు లేదా చల్లని నీరు తాగాలి
▶తీవ్రమైన ఎండలో బయటకి వెళ్ళినప్పుడు అనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో వున్న వైద్యుణ్ణి సంప్రదించి ప్రాధమిక చికిత్స పొంది వడ దెబ్బ బారిన పడకుండా కాపాడుకోవాలి


❌ చేయకూడనివి 

సూర్య కిరణాలకు, వేడి గాలికి గురి కాకుడదు
▶ వేడిగా ఉన్న సూర్య కాంతిలో గొడుగు లేకుండా తిరుగరాదు
▶ వేసవి కాలంలో నలుపురంగు దుస్తులు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు
▶ నెత్తికి టోపి లేక రుమాలు లేకుండా సూర్య కాంతిలో తిరుగరాదు
▶ వడదెబ్బకు గురి అయిన వారిని వేడి నీటిలో ముంచిన బట్టతో తుడువరాదు
▶మధ్యాహ్నం తరువాత ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని పనిచేయరాదు
▶ ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపిపదార్ధములు మరియు తేనె తీసుకోకూడదు
▶శీతలపానీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యము ఏర్పడుతుంది

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా