దశ తిరుగుతుందా..!

5 Sep, 2014 01:59 IST|Sakshi
దశ తిరుగుతుందా..!

 నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రకటన వెలువడింది. జిల్లా పరిస్థితి ఏమిటని ఆత్రుతతో ఎదురుచూసిన ప్రజల్లో చంద్రబాబు ఆశలు రేకెత్తించారు. అంతలోనే అనుమానాలూ పుట్టించా రు. దీంతో ఓ కంట కన్నీరు, మరో కంట పన్నీరు అన్నట్టుగా పరిస్థితి మా రింది. బాబు ప్రకటించిన పది వరాలతో జిల్లా ‘దశ’ తిరుగుతుందా....? లేదంటే ఆయన గత ప్రకటనల వలే హామీలుగా మిగిలిపోతాయా అన్న దానిపై ప్రజల్లో చర్చసాగుతోంది.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. నవ్యాంధ్రప్రదేశ్ కొత్తరాజధాని ప్రకటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు తన ప్రణాళికను అసెంబ్లీలో చదివి విని పించారు. అభివృద్ధిలో భాగంగా 10 హామీలను గుప్పించారు. అయితే కార్యరూపం దాల్చేదెలాగో చెప్పలేదు.
 
 పది వరాలు ఇవే...
 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, మెడికల్ కళాశాల, పోర్ట్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్, ఫుడ్ పార్క్, సంగీత, లలితకళల అకాడమీ, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుతో పాటు విజయనగరాన్ని స్మార్ట్ సిటీ, పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే తోటపల్లి ప్రాజెక్టు ను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని వెల్లడించారు. వినడానికి, చెప్పుకోవడానికి బాగున్నా ఆచరణకు నోచుకుంటాయా? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే శంకుస్థాపనలుచేసి వదిలేయడంతప్ప పూర్తి చేసి న దాఖలాలు పెద్దగా కన్పించలేదు. గత పనితీరును దృష్టి లో పెట్టుకుంటే వీటి అమలపై అనుమానాలు కమ్ముకుం టున్నాయి. ఇవన్నీ కార్యరూపంలోకి తెచ్చి పూర్తి చేస్తే మాత్రం సంతోషించిదగ్గ విషయమే. అదే జరిగితే జిల్లా అభివృద్ధి పథకంలో పయనిస్తుంది.
 
 ఏవేవి...ఎక్కడెక్కడ     
 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను భోగాపురంలోనూ, మెడికల్ కళాశాలను విజయనగరంలో, గిరిజన యూనివర్సిటీని పాచి పెంటలో, సంగీత, లలితకళల అకాడమీని విజయనగరం లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే, ఇందులో మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్మిస్తుందా? ప్రైవేటుకు అప్పగిస్తారా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.ఇక,పోర్ట్ విషయాని కొస్తే భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తీరప్రాంతం లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ పార్క్, ఫుడ్ పార్క్‌లను ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తామంటున్న విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా ఎలా తీర్చిదిద్దుతారన్న దానిపై స్పష్టత కొరవడింది.కాగా, తోటపల్లి ప్రాజెక్టుకు ఇటీవలబడ్జెట్‌లో రూ.20కోట్లు కేటాయించినసర్కార్ ఈ ఏడాదిలో ఎలా పూర్తిచేస్తారన్న దానిపై అనుమానం ఉంది.  
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా