'ఢీ'ఎస్సీ

11 Oct, 2018 11:33 IST|Sakshi

డీఎస్సీపై దాటవేత ధోరణి

ఏడాది నుంచి నోటిఫికేషన్లకే పరిమితమైన సర్కారు

వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్‌ తీసుకున్న అభ్యర్థులు

నోటిఫికేషన్‌ లేకపోయినా రకరకాల నిబంధనలు

ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన అభ్యర్థులు

బేల్దారి, పెయింటింగ్‌ పనులకు వెళుతున్న వైనం

ఒంగోలు టౌన్‌ : డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఏడాది నుంచి అదిగో డీఎస్సీ... ఇదిగో డీఎస్సీ అంటూ కాలయాపన చేస్తోంది. ఏడాదిలో మూడు నాలుగుసార్లు నోటిఫికేషన్‌ ఇస్తున్నామంటూ ప్రకటన చేయడం.. ఆ తరువాత వాయిదా వేయడ. ఒకటి రెండుసార్లు అయితే ఏదో సాంకేతిక కారణాలంటూ సరిపుచ్చుకోవచ్చు. నాలుగు నెలలకు, ఆరునెలలకు ఒకసారి ఇలా డీఎస్సీ ప్రకటన చేస్తూ ప్రభుత్వం నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులను నయవంచనకు గురిచేస్తోంది. కోచింగ్‌ కోసం వేలాది రూపాయలు ఖర్చుచేసినప్పటికీ ప్రభుత్వం డీఎస్సీని ప్రకటించకపోవడంతో అనేకమంది అభ్యర్థులు చివరకు బేల్దారి పనులు, పెయింటింగ్‌ పనులకు వెళుతున్నారు.

 చదివిన చదువుకు విలువ లేకుండా చేసిన ప్రభుత్వం, చివరికి వారిని చేతి కష్టాలకు అప్పగించింది. ఈసారైనా డీఎస్సీ ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూసిన అభ్యర్థులకు ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రకటించడంతో దానిపై కూడా నైతికంగా నిలబడుతుందా అంటే అది కూడా అనుమానంగా ఉంది. డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీచేసి షెడ్యూల్‌ను ప్రకటించి డీఎస్సీ పరీక్షలు నిర్వహించే నాటికి ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం సాకుగా చూపించి తమ పార్టీని తిరిగి గెలిపించిన వెంటనే డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరోమారు మోసగించేందుకు రంగం సిద్ధం చేశారని నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులు బాహాటంగా బాబు వైఖరిని విమర్శిస్తుండటం గమనార్హం.

277 పోస్టులా?
డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసినా, చేయకపోయినా జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా విద్యాశాఖ చూపించిన పోస్టులతో అభ్యర్థులు కళ్లు తిరిగిపోయాయి. జిల్లాలో 60 వేల నుంచి 70వేల మంది నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. దానికి తోడు ప్రతి ఏటా కొత్తగా కోర్సు పూర్తి చేసి బయటకు వస్తున్నవారు వేలాదిగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీ పోస్టుల భర్తీ జిల్లాల వారీగా చూస్తే, అందులో ప్రకాశం జిల్లాలో కేవలం 277పోస్టులు చూపించడం పట్ల నిరుద్యోగ అభ్యర్థులు విస్మయం వ్యక్తం చేశారు.

 వాస్తవానికి రెండు మూడు నెలలకు కలిíపితే  ఉపాధ్యాయ ఉద్యోగ విరమణలు చేసేవారి సంఖ్య 200 వరకు ఉంటుంది. గతంలో ఉన్న ఖాళీలను చూస్తే వందల సంఖ్యలో ఉంటాయి. వాటన్నింటికి నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించకుండా ప్రభుత్వం పరిమిత సంఖ్యలో ప్రకటన చేయించడంపట్ల నిరుద్యోగ అభ్యర్థులు రగిలిపోతున్నారు. జిల్లాలో చూపించిన 277 పోస్టులకు ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే, ఒక్కో పోస్టుకు 400 నుంచి 500 మంది అభ్యర్ధులు పోటీపడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలను బట్టి డీఎస్సీలను ప్రకటిస్తూ ఉంటే నిరుద్యోగ అభ్యర్థులకు అవకాశం కలిగి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు లభించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.

మెగా డీఎస్సీ మహానేతకే సాధ్యం..
డీఎస్సీ నిర్వహించాలంటేనే ప్రభుత్వం కప్పదాటు వైఖరిని అవలంభిస్తోంది. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 50వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించి వేలాది మంది నిరుద్యోగులను ఉపాధ్యాయులుగా చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తుత నిరుద్యోగ అభ్యర్థులు గుర్తు చేసుకోవడం గమనార్హం. వైఎస్‌ హయంలో డీఎïస్సీ రాసిన అభ్యర్థులు ధన్యులంటూ ప్రస్తుత నిరుద్యోగ అభ్యర్థులు కొనియాడుతున్నారంటే అప్పటి ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్నతేడా గమనించవచ్చు. దానికితోడు టీటీసీ పూర్తి చేసిన వారికి ఎస్‌జీటీ పోస్టులు, బీఈడీ పూర్తి చేసినవారికి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు రాసుకునేలా ఎవరికి వారికి అవకాశం కల్పిం చడంతోపాటు టీటీసీ పూర్తిచేసిన వారికి తమ పోస్టులు ఉంటా యన్న భద్రత ఆనాటి అభ్యర్థులకు వైఎస్‌ కల్పించారు. ప్రస్తు త చంద్రబాబు ప్రభుత్వం బీఈడీ పూర్తి చేసినవారు ఎస్‌జీటీ పోస్టులు రాసుకునే అవకాశం కల్పించి, ఎస్‌జీటీ అభ్యర్థులకు అన్యాయం చేస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు