‘విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌’

26 Jul, 2019 19:53 IST|Sakshi

సాక్షి, అమరావతి : తాము గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ కల్పిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. ఏపీ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ను మంత్రి సురేష్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం నుంచి ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ మొదలుపెట్టి, ఆగష్టు 5వ తేది నుంచి తరగతులు ప్రారంభం చేయనునట్లు వెల్లడించారు. ఎన్నికల హామీలో ఇచ్చిన మాటకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై శాసనసభలో కూడా రెండు ప్రత్యేక చట్టాలను ప్రవేశ పెట్టామని, నాణ్యమైన విద్యను పేదలకు అందించేందుకు ఈ చట్టాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణ, విద్య ప్రమాణాలను పాటించేలా రేగ్యులటరీ కమిషన్లను ఏర్పాటు చేసేలా చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ కమిషన్ల నిర్వహణ బాధ్యతను విశ్రాంత న్యాయమూర్తికి అప్పగిస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు