స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్దం: రామసుందర్‌ రెడ్డి

12 Feb, 2020 14:41 IST|Sakshi
ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ రామసుందర్‌రెడ్డి

సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తుది తీర్పు వెలువడగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ రామసుందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పందించారు. మీడిమాతో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు(కార్పొరేషన్, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల)కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలను పేపర్‌ బ్యాలెట్‌లోనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీలో 1,5732 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయని, కేరళ,  తమిళనాడు, రాష్ట్రాల నుంచి 13, 227 బ్యాలెట్ బాక్సులను తెప్పించామని తెలిపారు.

ప్రస్తుతం 1,18,959 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉంచామని, తెలంగాణ రాష్ట్రం నుంచి 40 వేల బ్యాలెట్ బాక్స్లు ఇచ్చేందుకు అనుమతించారని పేర్కొన్నారు. సర్పంచ్, ఎం.పి.టి.సి ఎన్నికలకు పింక్ కలర్ పేపర్, మున్సిపాలిటీ జెడ్పీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికలకు వైట్ కలర్ పేపర్ ఉపయోగిస్తామని అన్నారు. పంచాయితీ ఎన్నికలను రాజకీయ పార్టీల రహితంగా ఫ్రీ సింబల్స్ ఉపయోగిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు కావాల్సిన సామగ్రి సిద్ధంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు