యనమలతో అసంపూర్తిగా ఉద్యోగుల పీఆర్సీ భేటీ

13 Jan, 2015 16:13 IST|Sakshi

ఉద్యోగుల పీఆర్సీ విషయమై ఏపీ ఉద్యోగులతో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి భేటీ అసంపూర్తిగా ముగిసింది. కనీస వేతనం రూ. 15 వేలకు తక్కువ కాకుండా ఉండాలని, ఫిట్మెంట్ 62 శాతం ఇవ్వాలని, ఇంక్రిమెంట్లను 3 శాతానికి పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

కుటుంబ యూనిట్ నలుగురిగా గుర్తించాలని కోరారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు పలువురు మంగళవారం నాడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని కలిశారు. అయితే.. దీనికి మంత్రి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో భేటీ అసంపూర్తిగానే ముగిసింది.

మరిన్ని వార్తలు