ఏపీ: కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు

23 Mar, 2020 18:53 IST|Sakshi

విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికీ ఒక అధికారి నియామకం

కలెక్టర్లకు మార్గ దర్శకాలు జారీ

కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నత స్థాయి సమావేశం 

సాక్షి, విజయవాడ: కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చిన వారిని పూర్తి పర్యవేక్షణలో ఉంచే విధంగా  అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన వారిని పర్యవేక్షించడానికి ప్రతి 10 మందికీ ఒక అధికారి చొప్పున కేటాయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యూనివర్శిటీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు నియమించిన అధికారులతో ఉన్నత స్థాయి అధికారులు భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. కలెక్టర్లకు మార్గ దర్శకాలను జారీ చేశారు. మండల స్థాయిలో కొంతమంది అధికారులను కొవిడ్‌-19 ప్రత్యేక అధికారులుగా నియమించారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులపై ప్రతి రోజు వివరాల నమోదు, డేటా ఆధారంగా వైద్య శాఖ చర్యలు తీసుకోనుంది. (లాక్‌డౌన్‌: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు)

కరోనావైరస్‌ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆధ్వర్యంలో నలుగురు ఏఏఎస్‌ల బృందం ఏర్పాటు చేసింది. ఐఏఎస్‌ అధికారులు ప్రద్యుమ్న, గిరిజా శంకర్‌, కార్తికేయ మిశ్రా, కన్నబాబులను వైద్య ఆరోగ్య శాఖకు అటాచ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జవహర్‌రెడ్డి నేతృత్వంలో ఈ బృందం పనిచేయనుంది. (కరోనా: కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా