చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం 

3 Jul, 2020 11:31 IST|Sakshi
నెల్లిమర్లలోని ఓ చిన్న పరిశ్రమ

ఎంఎస్‌ఎంఈలకు రీస్టార్ట్‌ పేరుతో బకాయిల చెల్లింపు 

69 యూనిట్లు, 94క్లెయిమ్‌లకు రూ.15.82కోట్లు విడుదల 

హర్షం వ్యక్తం చేస్తున్న కంపెనీల యజమానులు

పరిశ్రమల మనుగడకు మరింత ప్రోత్సాహం

విజయనగరం పూల్‌బాగ్‌: పరిశ్రమలు పచ్చగా ఉంటే దానినే నమ్ముకున్న కారి్మకుల బతుకు బాగుంటుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దానిని కష్టాల్లోకి నెట్టేస్తే వేలాది కుటుంబాలపై దాని ప్రభావం పడుతుంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో పరిశ్రమల పరిస్థితి దయనీయంగా మారింది. కొత్త పరిశ్రమలు రాలేదు సరికదా... ఉన్నవి చాలావరకూ మూ తపడ్డాయి. ఫలితంగా జిల్లాలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది. అటువంటి తరుణంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించింది. పరిశ్రమలను ఆదుకునేందుకు కంకణం కట్టుకుంది. రీస్టార్ట్‌ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్‌ఎంఈ (చిన్నపరిశ్రమ)లకు బకాయిలు చెల్లించేసింది. రెండు విడతలుగా 194 క్లెయిమ్‌లకు రూ.15.82కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా కంపెనీల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

పరిశ్రమల పురోగతికి ఊతం 
చిన్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సాయం అందించింది. రీస్టార్ట్‌ ప్యాకేజీ పేరుతో ఎంఎస్‌ఎమ్‌ఈలకు ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రారంభించారు. మొదటి విడతలో 44 యూనిట్లకు 64 క్లెయిమ్స్‌ మొ త్తం రూ.6.92 కోట్లను మంజూరు చేశారు. రెండో విడ తలో 59 యూనిట్లకు చెందిన 130 క్లయిమ్స్‌ మొత్తం రూ.8.90 కోట్లు విడుదల చేసింది. రెండు విడతల్లో మొత్తం 194 క్లెయిమ్‌లకు రూ.15.82 కోట్లు విడుద లైంది. ఈ సహాయంతో జిల్లాలోని పరిశ్రమలకు ప్రోత్సాహంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. 

గర్వంగా ఉంది... 
15 ఏళ్లుగా కష్టాన్ని నమ్ముకుని అప్పు చేసి కంపెనీలు నడుపుతున్నాం. ఇటీవల కోవిడ్‌ వల్ల లాక్‌డౌన్‌లో ఇన్‌స్టాల్‌ మెంట్‌ చెల్లించలేని దుస్థితి దాపురించింది. బ్యాంకుకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. అటువంటి నాకు మొదటి విడతలో రూ.55 లక్షలు పెట్టుబడి రాయితీ లభించడం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని బ్యాంకుకు వెళ్తున్నాము. మాకు చేయూతనిచ్చి, మా పరువు నిలిపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. చిన్న పరిశ్రమల వైపు ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. ఇకపై చిన్న పరిశ్రమలకు మంచిరోజులు వస్తున్నాయి. 
– మామిడి వాసుదేవరావు, యజమాని, బల్‌్కడ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్‌ 

బడ్జెట్‌ లేకపోయినా.... 
ఇండస్ట్రీ బడ్జెట్‌ లేకపోయినా ఎంఎస్‌ఎమ్‌ఈలకు బకాయిలు చెల్లించడంతో పరిశ్రమలు చక్కగా నడిపించుకోవటానికి, ఇంకా మరింత మందికి ఉపాధి కల్పించేందుకు ఇప్పుడు చాలా అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఎంఎస్‌ఎమ్‌ఈలకు ఊతం ఉంటేనే ఎకానమీ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా లోకల్‌ మార్కెట్‌ బాగా డెవలప్‌ అయి నిత్యావసరాలు కావాల్సిన ఇంజినీర్‌ ప్రొడక్టులు గాని, దానికి సంబంధించిన సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎంఎస్‌ఎంఈల వల్ల అత్యధికంగా ఉపాధి కలుగుతుంది. తద్వారా సేవారంగం, ట్రాన్స్‌పోర్టు రంగం కూడా పెరుగుతుంది. జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. 
– కోట ప్రసాదరావు, జనరల్‌ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం, విజయనగరం   

మరిన్ని వార్తలు