హైకోర్టు తీర్పు: సుప్రీంను ఆశ్రయించిన ఏపీ సర్కార్‌

1 Jun, 2020 17:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దుచేయడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి. కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. దీంతో న్యాయస్థానం తీర్పుపై సంతృప్తి చెందని ప్రభుత్వం... సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుని తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని త్వరలోనే విచారణ స్వీకరించే అవకాశం ఉంది. (హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ నియామకమే చెల్లదు)

మరిన్ని వార్తలు