సీఎం జగన్‌ మాటంటే మాటే!

4 Oct, 2019 08:08 IST|Sakshi

మరో హామీని నిలబెట్టుకున్న వైఎస్‌ జగన్‌

ఒక్కొక్కటిగా పాదయాత్ర హామీల అమలు 

ఆటో, ట్యాక్సీవాలాలకు ఏటా రూ.10 వేలు 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేటి నుంచి మరో చరిత్రాత్మక పథకానికి శ్రీకారం చుడుతోంది. పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చుతోంది. మాట తప్పని మడమ తిప్పని కుటుంబంగా ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా మహానేత వైఎస్సార్‌ తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను వరుసగా నిలబెట్టుకుంటున్నారు. ఒక్కొక్క హామీ అమలుకు అడుగులు వేస్తున్నారు. ఆశా కార్యకర్తల వేతనాలు. అంగన్‌వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు ఇప్పటికే పెంచిన జగన్‌మోహన్‌రెడ్డి... వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు. సచివాలయాల ఏర్పాటు. రేషన్‌ కార్డుదారులకు నేరుగా ఇంటికే నాణ్యమైన బియ్యం పంపిణీ. పంట నష్టపరిహారం పెంపు. ఇలా ఒకటేంటి పాదయాత్రలో ఇచ్చిన  ప్రతి హామీని అమలు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం అందులో ఒకటిగా చేరుతోంది.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :  రికార్డులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి... ఎప్పటికప్పుడు ట్యాక్స్‌ చెల్లించుకోలేని దుస్థితి... అసలే అంతంతమాత్రపు బతుకులు... ఆపై ఫైనాన్షియర్ల వేధింపులు... ఇలా ఒకటేంటి అనేక ఇబ్బందులను ఆటో, ట్యాక్సీవాలాలు ఎదుర్కొంటున్నారు. నెలా ఖరొస్తే చాలు భయంభయంగా గడిపే పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం ఆరాటం... ఫిట్‌నెస్‌ కోసం పడిగాపులు... మరమ్మతుల కోసం ఆర్థిక ఇబ్బందులు... తదితర వాటితో నిత్యం కష్టాల కన్నీళ్లే. ఇన్ని బాధలు పడుతున్నా ఇంతవరకు ఏ ఒక్క పాలకుడు పట్టించుకోలేదు. కానీ పాదయాత్ర సమయంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ కార్మికులకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీని అమలు చేస్తున్నారు. శుక్రవారం నుంచి వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమం పేరుతో పథకాన్ని ప్రారంభిస్తున్నారు.    

జిల్లాలో 10,652మందికి లబ్ధి 
ఆటో, ట్యాక్సీ వాలాలకు చేయూతగా ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద సెప్టెంబర్‌ 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 28,144 వాహనాలుండగా, అందులో 10,798మంది యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. నమోదులో 38.49 శాతంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో జిల్లాలో నిలిచింది. వచ్చిన దరఖాస్తులను ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలించాక 146 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించగా,  మిగిలిన 10,652 దరఖాస్తులకు కలెక్టర్‌ ఆమోదం లభించింది. వీరందరికీ వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి రూ.10 వేల ప్రభుత్వ సాయం అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.400 కోట్లతో లక్షా 73వేల మందికి లబ్ధి చేకూరుతుండగా అందులో మన జిల్లాకు సంబంధించి 10,652మంది ఉన్నారు. రూ.10.65 కోట్లకు పైగా లబ్ధి పొందనున్నారు.   

అదే పది వేలు 

వాహన యజమానుల దరఖాస్తులు    10,798 
తిరస్కరించినవి  146
ఆమోదం పొందినవి 10,652 
ఏటా పొందనున్న లబ్ధి రూ.10.65
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా