క్లస్టర్ల విభజనకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు

3 May, 2020 21:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో క్లస్టర్ల విభజనకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వం 246 క్లస్టర్లను గుర్తించింది. గడిచిన 5 రోజుల్లో కేసులు రికార్డయితే అది వెరీ యాక్టివ్‌ క్లస్టర్‌.. గడిచిన 6 నుంచి 14 రోజుల్లోపు కేసులు నమోదైనా 5 రోజుల్లోగా కేసులు లేకపోతే అది యాక్టివ్‌ క్లస్టర్‌. గడిచిన 15 నుంచి 28 రోజుల్లో కేసులు నమోదైనా.. 15 రోజుల్లోగా కేసులు నమోదు కాకపోతే అది డార్మంట్‌ క్లస్టర్‌. 28 రోజులుగా కేసులు నమోదు కాకపోతే అక్కడ ఆపరేషన్‌ ముగుస్తుంది.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లో పాజిటివ్‌ కేసు ఉన్న ఇంటి నుంచి ప్రారంభమై 500 మీటర్ల నుంచి 1 కి.మీ వరకూ 3 కిలోమీటర్ల వరకూ బఫర్‌ జోన్‌  (కేసు ఉన్న ఇంటి నుంచి దూరంతో కలుపుకుని)  కేసుల సంఖ్య, కాంటాక్ట్స్, తీవ్రతను బట్టి జిల్లా అధికారులు పరిధిని మార్చవచ్చు. అర్బన్‌ ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ కాలనీలు, మున్సిపల్‌ వార్డులు వారీగా కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు.. కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌కు సమీపంలో ఉన్న వార్డులు, కాలనీల్లో సర్వేలెన్స్‌ కొనసాగుతుంది. రూరల్‌ ప్రాంతాల్లో పంచాయతీల ప్రాతిపదికన కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ కేసులు, కాంటాక్టులను బట్టి... అధికారులు దీనిచుట్టూ పరిధిని పెంచే అవకాశం ఉంటుంది. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో బారికేడ్లతో రోడ్ల మూసివేతతో పాటు అన్నిరకాల కదలికలు నిషేధం. నిత్యావసరాలకు ఇంటికి ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. వీలైనంత వరకూ ఇంటివద్దకే నిత్యావసరాల పంపిణీ చేస్తారు.  

కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల వద్దకే మొబైల్‌ వాహనాలతో నిత్యావసరాల పంపిణీ జరుగుతుంది. వ్యక్తుల కదలికలన్నీ రికార్డు చేస్తారు. ప్రతి కుటుంబం ఆరోగ్యపరిస్థితులపై సంపూర్ణంగా పర్యవేక్షిస్తారు. కేసులు వారి కాంటాక్టుల వివరాలను 12, 24 గంటలకోసారి అప్‌డేట్‌ చేస్తారు. వైరస్‌ సోకినవారికి ఉన్న లక్షణాలను బట్టి క్వారంటైన్‌కు తరలిస్తారు. హై రిస్క్‌ ఉన్నవారికి వ్యాధి సోకితే ప్రోటోకాల్‌. మంచి వైద్యం కోసం తరలిస్తారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లో ఉన్నవారంతా ఆరోగ్య సేతులో 100 శాతం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని వార్తలు