వేతనానందం

14 Oct, 2019 11:54 IST|Sakshi

జీతాల పెంపుతో.. హోంగార్డుల్లో సంతోషం

మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌  

హోంగార్డుల వ్యవస్థసంక్షేమం దిశగా అడుగులు  

పోలీస్‌శాఖలోని హోంగార్డుల జీవితాల్లో దీపావళి వెలుగు ముందే వచ్చేసింది.  ప్రభుత్వం వారి వేతనాలను పెంచడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో హోంగార్డుల కష్టాలను ప్రత్య
క్షంగా చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..సీఎం అయ్యాక తొలి మంత్రివర్గ సమావేశంలోనే వారి వేతనాలను పెంచుతూ నిర్ణయంతీసుకున్నారు. ఆ మేరకు నెలకు రూ.18000నుంచి 21,300 పెంచుతూ ప్రభుత్వంశనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

కడప అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల దినసరి వేతనాన్ని రోజుకు రూ.600 నుంచి 710కు పెంచింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, ఇంత త్వరగా అమలులోకి తీసుకొచ్చారని, తమ కుటుంబాల్లో మరింత వెలుగు నింపారని హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోంగార్డులకు నెలసరి వేతనాన్ని రూ.3 వేల నుంచి 6 వేలకు పెంచారని, ఆయన తనయుడు మళ్లీ ఇప్పుడు పెంచారని వారు పేర్కొంటున్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హోంగార్డుల వేతనాన్ని పెంచుతామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేశారని అన్నారు. నెలసరి జీతం రూ.18000 నుంచి 21,300 వచ్చేలా చేశారని హర్షం వ్యక్తం చేశారు. 

715 కుటుంబాలకు ప్రయోజనం
జిల్లా  పోలీసు శాఖలో సుమారు 715 మంది హోంగార్డులు పని చేస్తున్నారు.  హోంగార్డుల జీతాలు పెంచుతూ శనివారం సాయంత్రం జీఓ విడుదలైంది. జిల్లాలో 715 మందికి ప్రయోజనం కలగనుంది. అందులో 58 మంది మహిళలు ఉన్నారు.  జీతాలు పెంచినందుకు జిల్లాలోని హోంగార్డులు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.  

మాట నిలబెట్టుకున్న సీఎం
హోంగార్డుల జీతం పెంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. మా జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.     – కె.శ్రీనివాసులు, హెచ్‌జీ 959, కడప వన్‌టౌన్‌

దీపావళి ముందే వచ్చింది
మాకు జీతాలు పెంచడం హర్షణీయం. దీపావళికి ముందే మా జీవితాల్లో వెలుగు నింపారు. మా కుటుంబ సభ్యులందరం సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం.     – సి.జలజాక్షి, డబ్లూహెచ్‌జీ  201, కడప

హర్షణీయం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు నెలల్లోనే అన్ని వర్గాల సంక్షేమంతో పాటు మాపై కూడా దృష్టి పెట్టి వేతనాల పెంపు చేపట్టడం హర్షణీయం. – పి.కిషోర్‌బాబు, హెచ్‌జి 838, కడప ఒన్‌టౌన్‌ పీఎస్‌ డ్రైవర్‌  

ఆత్మస్థైర్యం పెంచారు
హోంగార్డుల వ్యవస్థలో పని చేస్తున్న మహిళలలో కూడా ఈ వేతనాల పెంపు మరింత ఆత్మస్థైర్యం పెంపొందిస్తోంది. కారుణ్య నియామకాల కింద పోలీసు కుటుంబాల సభ్యులకు కొందరికి హోంగార్డులుగా.. గతంలో పని చేసిన పోలీసు అధికారులు నియామకాలు చేపట్టారు. అలాంటి వారి జీవితాల్లో మరింత వెలుగు నింపారు.      – శ్యామల, మహిళా హోంగార్డు, జిల్లా పోలీసు కార్యాలయం, కడప 

మరిన్ని వార్తలు