అర్చకుల చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎం జగన్‌

21 Oct, 2019 21:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. అర్చకుల చిరకాల స్వప్పమైన వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే చట్టం అమల్లోకి తెచ్చారు. 2007 లో మహానేత వైఎస్సార్‌ అర్చకులకు వంశపారంపర్య చట్టాన్ని తీసుకురాగా,  గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయలేదు. పదేళ్ల తర్వాత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ చట్టాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ జీవో విడుదల చేయడం పట్ల అర్చక సమాఖ్య ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు