హథీరాంజీ మఠం భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం

29 Jan, 2020 12:26 IST|Sakshi

సాక్షి, అమరావతి :  తిరుపతిలోని హథీరాంజీ మఠం భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మఠం కస్టోడియన్‌ అర్జున్‌ దాస్‌ మహంతుపై సస్పెన్షన్‌ వేటు వేసింది. మఠం ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నట్లు మహంతుపై అభియోగాలు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి ఈవోకు మఠం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

కాగా తిరుపతి సమీపంలోని హథీరాంజీ మఠం భూములు గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైన సంగతి తెలిసిందే. వందల కోట్ల విలువైన హథీరాంజీ మఠం భూముల్లో భూ మాఫియా తిష్ట వేసింది. దొంగ పత్రాలు సృష్టించి, కాసులతో రిజిస్ట్రేషన్‌ అధికారుల కళ్లకు గంతలు కట్టి దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు చేసుకుంది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి మఠం భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసింది. గత ప్రభుత్వంలో ఈ పచ్చ భూమాఫియా స్వాహా చేసిన మఠం భూముల విలువ రూ.100 కోట్లకు పైమాటే.

మరిన్ని వార్తలు