విజయవాడలో 14 పునరావాస కేంద్రాలు..

10 Apr, 2020 21:25 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో వీఎంసీ (విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌) పునరావాస కేంద్రాల పెంపుపై దృష్టి పెట్టింది. నగరంలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కళాశాల్లో కొత్తగా మరో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నిరాశ్రయులు, వలస వాసుల కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. గుర్తించిన 200 మందిని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజిలో ఏర్పాటు చేసిన పునరావాసానికి తరలించారు. భౌతిక దూరం పాటించేలా పడకలు ఏర్పాటు చేయడంతో పాటు.. మెరుగైన సదుపాయాలతో ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. ప్రతి నిత్యం వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నోడల్‌ అధికారి పర్యవేక్షణలో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు