ఇంటింటికీ కుళాయి..ఎప్పటికోయి..!

9 Mar, 2018 11:56 IST|Sakshi

గొంతెండుతోన్న గ్రామాలు

ఇంకా సర్వే దశలోనే పనులు

377 గ్రామాల్లో తాగునీరందించడమే లక్ష్యం

ఎర్రకాలువ జలాశయం పథకాలపైనా నిర్లక్ష్యం

జంగారెడ్డిగూడెం రూరల్‌: వేసవి ప్రారంభంలోనే జిల్లావాసుల గొంతెండిపోతోంది. ఒక పక్క ఎండలు ముదురుతున్నాయి. వేసవిలో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు చేపట్టాల్సిన పనులు సైతం ప్రణా ళికల స్థాయిలోనే ఉన్నాయి. తాగునీటి సమస్యను తీర్చేందుకు చేపట్టాల్సిన ఇంటింటికీ కుళాయి పథకం ప్రణాళిక దశలోనే ఉంది. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుగా పేరున్న  జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎ ర్రకాలువ జలాశయం మంచినీటి పథకాలు ముందుకు సాగడం లేదు.

ఇంకెంత కాలం
జిల్లావాసులు తాగునీటి ఎద్దడిని అధిగ    మించేందుకు గతేడాది గ్రామస్థాయి నుంచి ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేసేం దుకు జిల్లా యంత్రాంగం మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. జిల్లాలో ముంపు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు మినహా 46 మండలాల పరిధిలో సమగ్ర ప్రణాళికలు రూపొందించారు.  ఈ పథకం ఇంకా కార్యరూపం దాల్చలేదు. సర్వే మొదలైందని అధికారులు చెబుతున్నారు. మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉందని అంటున్నారు.

రూ.4.71 కోట్లతో యాక్షన్‌ ప్లాన్‌
వేసవిలో తాగునీటి ఎద్దడిని గుర్తించి ఆయా గ్రామాల్లో అవసరాన్ని తీర్చే క్రమంలో భాగంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ రూ.4 కోట్ల 71 లక్షల యాక్షన్‌ ప్లాన్‌ను రూపొం దించింది. 377 గ్రామాల్లో నీటి అవసరాలు తీర్చేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు.

ఎర్రకాలువపై నీటి పథకాలసాకారం ఎప్పటికో..
జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ఏడాదంతా నీటితో  కళకళలాడుతుంది. మెట్ట రైతులకు సాగునీటి అవసరార్థం నిర్మించిన ఈ జలాశయ నీటిని శుద్ధి చేసి గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి అందించాలనే లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా రూ.5 కోట్ల నిధులతో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. జలాశయం నీటిని ఇక్కడ నిర్మించిన ట్యాంకుల ద్వారా ఫిల్టర్‌ చేసి జంగారెడ్డిగూడెం మండలంలో 21 పంచాయతీల్లోని గ్రామాలను నీటిని అందించేందుకు ఈ పథకాన్ని ఏర్పాటుచేశారు. అయితే అనుకున్న లక్ష్యం మేర తాగునీరు గ్రామాలకు అందటం లేదు. ఈ మంచినీటి పథకం ప్రారంభించి ఏళ్లు దాటుతున్నా పూర్తిస్థాయిలో తాగునీటి అందడం లేదు. 8 గ్రామాలకు 5 లక్షల లీటర్ల నీటిని మాత్రమే జలాశయం అందిస్తున్నారు.

ఎ.పోలవరం, చిన్నంవారిగూడెం, పిషరీస్‌ కాలనీ, చల్లావారిగూడెం, తాడువాయి, మాన్నతగూడెం, జొన్నవారిగూడెం మంగిశెట్టిగూడెం, గొల్లగూడెం గ్రామాలకు మరికొద్ది రోజుల్లో నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్నారు. ఈ గ్రామాలకు కూడా నీటి సరఫరా జరిగితే మరో 5 లక్షల లీటర్ల నీరు పంపిణీ అవుతోంది. దీంతో పలుగ్రామాల్లో మంచినీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇదే జలాశయం నుంచి జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మంచినీటి అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రూ.88 కోట్లలో 10 శా తం నగరపంచాయతీ, 10 శాతం ప్రభుత్వం, మిగిలిన 80 శాతం ఏషియన్‌ బ్యాం కు రుణంతో పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. పథకంలో భాగంగా ట్యాంకులు నిర్మించి 41 లక్షల లీటర్ల ఎర్రకాలువ జలాశయం నీటిని స్టోర్‌ చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ పథకం ప్రారంభం కావడానికి మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది.

సర్వే మొదలైంది
ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ ఏర్పాటుపై సర్వే మొదలైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు మునిగిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ మండలాలు మినహా జిల్లా అంతా ఈ పథకం వర్తిస్తుంది. డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. మరో నెల, రెండు నెలల్లో పూర్తయి అందుబాటులోకి ఈ పథకం రానుంది. ఈ వేసవిలో తాగునీటి అవసరాల కోసం రూ.4.71 కోట్లతో యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాం.– అమరేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్య వ్యాపారం కాదు.. సేవ మాత్రమే: సీఎం జగన్‌

యువకుణ్ణి భుజంపై మోసిన 'ఆ' ఎస్సైకు రివార్డు!

‘టిక్ టాక్’ కోసం అడవులకు వెళ్లి..

‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’

సీఎం జగన్‌కు జపాన్‌ ఆహ్వానం

ఈనాటి ముఖ్యాంశాలు

‘సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం’

32 లక్షల మంది వంచనకు గురయ్యారు

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

సంగం డైరీలో దొంగలు పడ్డారు

జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

పులుల సంఖ్య పెరగడం సంతోషం : సీఎం జగన్‌

సంచలన కేసులను చేధించిన సిబ్బందికి అవార్డులు!

‘వంద కోట్లకు పైగా తగలేశారు’

చట్టవ్యతిరేక పనులను సహించం

ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి

ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా

ఏపీలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

రైల్వే ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల ఆగ్రహం

సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ

ఉద్యోగాల విప్లవం తెచ్చాం : ఎమ్మెల్యే మేకపాటి 

అంతా మా ఇష్టం

ఆదివారం అంతే మరి!

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా

పురిటి పేగుపై కాసుల కత్తి

జగన్‌ మొదటి బడ్జెట్‌.. మనసున్న బడ్జెట్‌

మేఘమా.. కరుణించుమా!  

వైద్యరంగంలో ఇదో అద్భుతం

కొలువుల జాతర: ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’