బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దు: ఉత్తర్వులు జారీ

26 Sep, 2019 17:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ ఏజెన్సీలో చంద్రబాబు ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన బాక్సైట్‌ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దుకు సంబంధించిన ఫైల్‌పై గత గురువారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేయగా, తాజాగా అనుమతులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని.. గతంలో టీడీపీ సర్కార్‌ ఇచ్చిన మైనింగ్‌ లీజును రద్దు చేస్తామని విపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు బాక్సైట్‌ లీజును రద్దు చేశారు. అనంతగిరి రిజర్వ్‌ ఫారెస్ట్‌, జెర్రెల బ్లాక్ 1,2,3, గాలికొండ, చిత్తమగొండి, రక్తికొండ, చింతపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ గ్రామాల్లో బాక్సైట్‌ అనుమతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనుల పోరాటానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ఇచ్చారు. రెండేళ్ల కిందటే బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు 2,226 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలకు  సీఎం జగన్‌ మాట నిలబెట్టుకున్నారు. (చదవండి: విశాఖ జిల్లాలో.. బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దు)

ఐదు జీవోలు జారీ..
బాక్సైట్‌ తవ్వకాల అనుమతులు రద్దుకు సంబంధించి మొత్తం 5 జీవోలను ఏపీ  ప్రభుత్వం జారీ చేసింది.
జీవో నెంబర్‌ 80- విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని రక్తకొండ గ్రామ పరిధిలో 113.192 హెక్టార్ల బాక్సైట్‌ మైనింగ్‌ లీజు  రద్దు 
జీవో నెంబర్‌ 81- చింతపల్లి, అరకులో 152 ఎకరాల బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దు 
జీవో నెంబర్‌ 82- అనంతగరి మండలం గాలికొండలో 93.886 హెక్టార్ల మైనింగ్‌లీజు రద్దు.
జీవో నెంబర్‌ 83 - జెర్రెల బ్లాక్‌–1 లో 85 హెక్టార్ల బాక్సైట్‌ మైనింగ్‌లీజు రద్దు
జీవో నెంబర్‌ 84- జెర్రెల బ్లాక్‌–2,3లో 617 హెక్టార్లకు సంబంధించి చింతపల్లిలో మైనింగ్‌లీజు రద్దు 
జీవో నెంబర్‌ 85- చింతపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో జెర్రెల బ్లాక్‌–3 లో మరో 460 హెక్టార్లలో మైనింగ్‌లీజు రద్దు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోలేరు’

భారీ వర్షం.. కొట్టుకుపోయిన ఆలయం

రివర్స్‌ టెండరింగ్‌తో ఆదా ఆహ్వానించదగ్గ విషయం

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి సీఎం జగన్‌ ఆదేశాలు

బనగానపల్లె ఆసుపత్రి సామర్థ్యం పెంపు : ఎమ్మెల్యే కాటసాని

గోదావరిలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బోటుకు తప్పిన ప్రమాదం

ప్రకాశం బ్యారేజ్‌కి మళ్లీ వరద; కలెక్టర్‌ ఆదేశాలు

నా కొడుకు అయినా సరే.. మంత్రి పేర్ని నాని

పార్లమెంటులో పార్టీ కార్యాలయాల కేటాయింపు

రేసులో సాకే, చింతా మోహన్‌, పద్మశ్రీ!

‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు’

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

రైతు భరోసా.. ఇక కులాసా

‘ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్లు’

వ్యాపారుల ఉల్లికిపాటు

ఆర్టీసీని మంచి సంస్థగా తీర్చిదిద్దాలనే: కృష్ణబాబు

‘కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములు స్వాధీనం’

కళావిహీనంగా భైరవకోన..

దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు..

‘ఇంత దిగజారి పోయారేంటి బాబు?’

5.30 గంటల్లో విశాఖ నుంచి బెజవాడకు..

రమ్యానే పిలిచినట్టు అనిపిస్తోంది..

ట్రిపుల్‌ ఐటీ తరగతులు ప్రారంభానికి సిద్ధం

7వ ఆర్థిక గణన సర్వే ఆరంభం

ఇక్కడ ప్రతి ఆహార పదార్థం కల్తీ!

సీఎం జగన్‌ను కలిసిన ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తల బృందం

దాచేపల్లి, గురజాలకు మున్సిపాలిటీ హోదా

ఆ గడ్డపై ఎన్నో సమరాలు.. తెగిపడిన తలలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనారోగ్యంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌

అలీరెజా వస్తే.. బిగ్‌బాస్‌ చూడం!

ఆ విషయం వాడినే అడగండి: ప్రియాంక

అక్టోబర్ 18న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’

కమల్‌ హాసన్‌పై నిర్మాత కంప్లయింట్‌

నయనతార పెళ్లికి ముహూర్తం కుదిరింది!