జగనన్న విద్యా దీవెనకు ప్రభుత్వం ఉత్తర్వులు

30 Nov, 2019 14:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జగన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలకు జగనన్న విద్యా దీవెన వర్తిస్తుంది. ఐటీఐ నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని ఉన్నత విద్యలకు ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు కానున్నది.

జగనన్న వసతి దీవెన పథకం కింద పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందనున్నది. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐకి రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు అందుతాయి.  డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు వసతి దీవెన సహాయం లభించనుంది. వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలు లోపు ఉన్న పేద కుటుంబలందరికి ఈ పథకం వర్తింస్తుంది. అర్హులయిన విద్యార్థుల ఎంపిక చేపట్టాలని సంబంధింత శాఖలను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు