సిద్ధమవుతున్న సచివాలయాలు 

21 Oct, 2019 08:45 IST|Sakshi

సాక్షి, విజయనగరం రూరల్‌: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయాల వ్యవస్థను రూపొందించారు. అంతేగాకుండా దానిని తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అధికార వికేంద్రీకరణ చేయడం ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో... ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం కావాలన్న ఆలోచనతో ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లాలోని 664 గ్రామ సచివాలయాల్లో తొలిరోజు 33 గ్రామ సచివాలయాలను అధికారులు ప్రారంభించారు.  

అందుబాటులో ఉన్నవి 392 
జిల్లాలో 664 గ్రామ సచివాలయాలకు 392 భవనాలు అందుబాటులో ఉండటంతో అధికారులు వాటిని సిద్ధం చేస్తున్నా రు. ఇప్పటికే జిల్లాలో 60 వరకు భవనాలు సిద్ధం చేసి వాటిని ప్రారంభించారు. మరో 272 సచివాలయాలకు భవనాలు భవనాలు సిద్ధంగా లేవని అధికారులు తెలిపారు. 

మొదలైన సచివాలయ వ్యవస్థ 
గ్రామ సచివాలయాల్లో ప్రజలకు సేవలందించడానికి ఇప్పటికే ఉద్యోగులను, గ్రామ వలంటీర్లను నియమించారు. 14 శాఖల్లో ఉద్యోగాలకు 5915 అవసరం కాగా వీరిలో అనేకమందిని ఇప్పటికే నియమించారు. అంతే గాకుండా బాధ్యతలు సైతం అప్పగించారు. అలాగే 10853 మందికి పైగా వలంటీర్లను నియమించగా వీరంతా వారికి కేటాయించిన కుటుంబాల వివరాలను సేకరించారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులకు తాము చేపట్టబోయే విధులపై శిక్షణ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.  

మరిన్ని వార్తలు