రివర్స్‌ టెండరింగ్‌లో మరో రూ.33.76 కోట్లు ఆదా..

9 Nov, 2019 21:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: రివర్స్‌ టెండరింగ్‌లో రాష్ట్రానికి మరో రూ.33.76 కోట్లు ఆదా అయింది. గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చే సిమ్‌కార్డుల కొనుగోలులో ఏపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్ళింది. ఓపెన్‌ మార్కెట్‌లో నెలవారీ పోస్ట్‌పెయిడ్‌ ఛార్జీలు రూ.199 ఉండగా, రివర్స్‌ ఆక్షన్‌లో రూ.92.04లకే  ఎయిర్‌టెల్‌ బిడ్డింగ్‌ దక్కించుకుంది. ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండర్ ప్రక్రియ ఏపీప్రభుత్వం నిర్వహించింది. ఫైనాన్షియల్ బిడ్‌లను ఈనెల 6న ఏపీటీఎస్‌ తెరిచింది. ఎల్1 కంపెనీ, 4జీ సిమ్లకు మూడేళ్లకు రూ.121.54  కోట్ల  టెండర్ దాఖలు చేసింది.

ఈ నెల 7న రూ. 121.54 కోట్ల ప్రారంభ ధరగా రివర్స్టెండరింగ్‌ ఆక్షన్‌లో రూ.87.77 కోట్లకు ఎయిర్‌టెల్‌ టెండర్‌ దక్కించుకుంది. దీంతో రివర్స్‌ ఆక్షన్‌లో ప్రభుత్వానికి రూ.33.76 కోట్లు ఆదా అవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 4జీ సీమ్‌లకు చెల్లించే నెలవారీ పోస్ట్‌పెయిడ్‌ ఛార్జీలు రూ.92.04కి తగ్గిందని ఏపీటీఎస్‌ తెలిపింది. అన్‌లిమిటెడ్‌ నేషనల్‌ కాల్స్‌, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 4జీ వేగంతో 1 జీబీ డేటాను ఎయిర్‌ టెల్‌ కంపెనీ ఇవ్వనుంది.

మరిన్ని వార్తలు