రివర్స్‌ టెండరింగ్‌ మరోసారి బిగ్‌ హిట్‌

3 Dec, 2019 20:13 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్‌ టెండరింగ్‌ మరోసారి బిగ్‌ హిట్‌గా నిలిచింది. స్మార్టఫోన్ల కొనుగోలులో రూ. 83.8 కోట్ల ప్రజాధనం ఆదా అయింది. అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం 2,64,920 స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌(ఏపీటీఎస్‌) టెండర్లు పిలిచింది. అందులో భాగంగా ఏపీటీఎస్‌ నవంబర్‌ 30వ తేదీన తొలిదశ బిడ్డింగ్‌ తెరువగా.. ఎల్‌-1 సంస్థ రూ. 317.61 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. 

అయితే ఎల్‌-1 ధరపై ఏపీటీఎస్‌ రివర్స్‌ టెండరింగ్‌లో బహిరంగ వేలం నిర్వహించింది. ఇందులో అదే ఎల్‌-1 సంస్థ రూ. 233.81 కోట్లకు కోడ్‌ చేసి బిడ్‌ దక్కించుకోంది. తొలిదశ బిడ్డింగ్‌తో పోల్చితే ఎల్‌-1 కంపెనీ రూ. 83.8 కోట్ల తక్కువకు కోడ్‌ చేసింది. గతంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లలో ఏపీ ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని ఆదా చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేటి ముఖ్యాంశాలు..

మరో మూడు కోవిడ్‌ ల్యాబొరేటరీలు

ఏపీలో పాజిటివ్‌ 149 

సమగ్ర వ్యూహం

కరోనాపై పోరాటం: రంగంలోకి ‘మాయల ఫకీరు’

సినిమా

లాక్‌డౌన్‌: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!

అప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌!

సరోజినీ నాయుడుగా...

వైరసవత్తరమైన సినిమాలు

పిల్ల‌ల‌తో క‌లిసి విరాళ‌మిచ్చిన బాలీవుడ్ న‌టి

ప్రేమ‌ప‌క్షులు..ఇప్పుడు ఇంట్లోనే ఆనందంగా