వర్ల రామయ్యకు ప్రభుత్వం నోటీసులు జారీ

28 Sep, 2019 12:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం మారినా టీడీపీ సీనియర్‌ నేత, ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ‍్య మాత్రం ఆ పదవిని పట్టుకుని వేళ్లాడుతూనే ఉన్నారు. దీంతో ఆ పదవి నుంచి వైదొలగడానికి రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్‌ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ, వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్‌ 24, 2019లో ముగిసినా ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దీంతో ఏపీఎస్‌ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్‌-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు నిన్న నోటీసు జారీ చేశారు. అదే విధంగా విజయవాడ జోనల్‌ చైర్మన్‌ పార్థసారధికి కూడా ఒక నెల గడువిస్తూ ఆర్టీసీ నోటీసులు ఇచ్చింది. ఇదే సమయంలో కడప జోనల్‌ చైర్మన్‌ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి రాజీనామాను ఆమోదించింది.

మరిన్ని వార్తలు