కరోనా నివారణకు ఏపీ సర్కార్‌ ప్రత్యేక దృష్టి

27 Jun, 2020 12:41 IST|Sakshi

కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌

సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కోవిడ్ టెస్టుల శాతాన్ని గణనీయంగా పెంచే ప్రయత్నం చేస్తోంది. త్వరితగతిన కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐ మాస్క్ బస్సులను రంగంలోకి దించింది. విజయవాడ సిటీలో ఎనిమిది చోట్ల శ్వాబ్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి రోజుకు రెండు వేల మందికి టెస్టులు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. (అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్‌..)

ఐ మాస్క్ బస్సుల ద్వారా జరుగుతున్న కోవిడ్ టెస్టుల ప్రక్రియను కలెక్టర్ ఇంతియాజ్ శనివారం పరిశీలించారు. ప్రతీ అరగంటకు ఒకసారి హైపోక్లోరైడ్ స్ప్రే చేయాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. (బస్సులు, రైళ్లలో జర్నీకి ఝలక్‌ !)

మరిన్ని వార్తలు