రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటి వద్దకే పెన్షన్‌' ప్రారంభం

1 Feb, 2020 10:21 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 'ఇంటి వద్దకే పెన్షన్‌' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉ‍న్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు అందజేసిన స్మార్ట్‌ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న వైఎస్సార్ పెన్షన్‌ కానుకలో మరో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది.

శనివారం ఉదయం వలంటీర్లు స్వయంగా లబ్ధిదారుడు ఇంటికెళ్లి పింఛన్లు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమం చేపట్టారు. పింఛన్లు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న ఫించన్ దారులకు డోర్ డెలివరీ విధానం ఎంతో ఆనందం కలిగిస్తోంది. తాము ఎప్పుడు ఉంటే అప్పుడే ఇంటికొచ్చి మాకు వలంటీర్లు పింఛన్లు ఇస్తుండడం సంతోషంగా ఉందని, దీని వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటివద్దకే పెన్షన్‌ కార్యక్రమంలో  భాగంగా తాడేపల్లి పట్టణం క్రిస్టియన్‌ పేటలో వార్డు వలంటీర్లతో కలిసి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పించన్‌ అందజేశారు. 

విశాఖ .. జిల్లా ‌వ్యాప్తంగా ఇంటింటికీ ఫించన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగన్నర లక్షల మందికి 99 కోట్ల రూపాయలను పించన్లగా వాలంటీర్లు అందిస్తున్నారు.ఇంటింటికీ ఫించన్ల పంపిణీ కార్యక్రమానికి విశాఖ జిల్లాలో  20 వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.విశాఖ సిటీ, రూరల్, ఏజెన్సీ ప్రాంతాలకి పర్యవేక్షకులగా ఐఎఎస్ అధికారులను ఏర్పాటు చేసి కలెక్టర్ వినయ్ చంద్ పర్యవేక్షిస్తున్నారు.ఇంటి వద్దకే ఫించన్లు అందిస్తుండటంపై లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా.. కృష్ణా జిల్లాలో ఇంటివద్దకే పెన్షన్‌ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.నూజివీడు పురపాలక సంఘం 30 వార్డుల్లో 4046 మందికి ఇంటివద్దకే వెళ్లి  వలంటీర్లు పెన్షన్లు అందజేశారు. పెన్షన్లు అందజేసే విధానాన్ని నూజివీడు మున్సిపల్ కమిషనర్ వాసుబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇంటివద్దకే పెన్షన్ అమలుపై వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గుడివాడ నియోజకవర్గంలో ఇంటి వద్దకే పెన్షన్‌ పథకం ప్రారంభం.... గ్రామ, వార్డు వలంటీర్లు తమకు అందజేసిన స్మార్ట్‌ ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్‌ అందజేస్తున్నారు.

మచిలీపట్నం టౌన్తో పాటు రూరల్ లలోనూ వలంటీర్లు ఇంటి వద్దకే పెన్షన్‌ పథకాన్ని ప్రారంభించారు.

కైకలూరు నియోజకవర్గంలో మండవల్లి ,ముదినేపల్లి ,కలిదిండి, కైకలూరు మండలాల్లో ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే దూల నాగేశ్వరావు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రామ ,వార్డు వాలంటీర్ల స్మార్ట్‌ ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు ఫించన్లు అందజేస్తున్నారు.

తూర్పు గోదావరి.. జిల్లాలోని కొత్తపేట ,రావులపాలెం,ర్యాలి,ఆలమూరులో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటివద్దకే పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గ్రామ, వార్డు వలంటీర్లు స్మార్ట్‌ ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు ఫించన్లు అందజేస్తున్నారు. అమలాపురం నియోజకవర్గంలో ఇంటింటికి పింఛన్ల పంపిణీని మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి ప్రారంభించారు.,ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు