శ్రీజకు ప్రభుత్వం అండ 

9 Dec, 2019 09:10 IST|Sakshi
సీఎం కార్యాలయ సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడుతున్న జ్యోతి

శ్రీజ వైద్యానికి సర్కారు భరోసా

బాధితురాలి తల్లికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌

మెరుగైన వైద్యం అందిస్తామని హామీ

ఆనందం వ్యక్తం చేసిన చిన్నారి తల్లి జ్యోతి  

రేగిడి: రేగిడి ఆమదాలవలస మండలం నాయిరాల వలస గ్రామానికి చెందిన తలసేమియా బాధితురాలు కొవ్వాడ శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది. ఈ నెల 6వ తేదీన సాక్షి దిన పత్రికలో ‘చిన్నారి ప్రాణానికి ఆపద’ అనే శీర్షికపై వెలువడిన కథనానికి దాతలతోపాటు ప్రభుత్వం నుంచి కూడా స్పందన లభించింది. సీఎం కార్యాలయం నుంచి శ్రీజ తల్లి జ్యో తితో ఫోన్‌లో మాట్లాడారు. శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పారని జ్యోతి ఆదివారం ‘సాక్షి’కి వెల్లడించారు. కుమార్తె అనారోగ్య స్థితిని, మెడికల్‌ సరి్టఫికెట్లను సీఎం కార్యాలయానికి పంపించామని ఆమె తెలిపారు. జిల్లాలోనూ చాలా మంది మానవతావాదులు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారని, సాయం కూడా చేశారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు