రాష్ట్ర పండుగగా కాటన్ జయంతి

11 May, 2015 05:16 IST|Sakshi
రాష్ట్ర పండుగగా కాటన్ జయంతి

- 15న రాజమండ్రిలో వేడుకలు... జల వనరుల శాఖ ఏర్పాట్లు


హైదరాబాద్: ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్‌లను నిర్మించిన సర్ ఆర్థన్ కాటన్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15న రాజమండ్రిలో కాటన్ 212 జయంతి వేడుకలను నిర్వహించడానికి జల వనరుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ అధికారులు పాల్గొననున్నారు. కాటన్‌తో పాటు ప్రముఖ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రామకృష్ణయ్య, కేఎల్ రావు జయంతులను కూడా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా