మళ్లీ భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

18 Jan, 2015 23:32 IST|Sakshi

వెయిటింగ్‌లో ఉన్న పదిమందికి పోస్టింగులు
సీసీఎల్‌ఏగా అనిల్ చంద్ర పునేఠా
కొన్ని విభాగాల కలిపివేత


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు భారీ స్థాయిలో ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ నెల ఏడో తేదీన పెద్ద ఎత్తున చేసిన ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగుల్లోనూ తాజాగా స్వల్ప మార్పులు చేసింది. పలువురిని బదిలీ చేయడంతోపాటు వెయిటింగ్‌లో ఉన్న పదిమందికి పోస్టింగులు ఇచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తగ్గిన జనాభా, ఐఏఎస్ అధికారుల కొరతను దష్టిలో పెట్టుకుని కొన్ని విభాగాలను ఒకటిగా కలిపేసింది.

ఇప్పటివరకూ వేర్వేరుగా ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్లను కలిపేసింది. అదేవిధంగా సాంకేతిక విద్య, కాలేజియేట్ విద్య కమిషనరేట్లను కలిపేసింది. వేర్వేరుగా ఉన్న కార్మిక, ఉపాధి కల్పన కమిషనరేట్లను సైతం ఒక్కటిగా మార్చింది. విపత్తు నిర్వహణ శాఖకు కమిషనర్ బదులు డెరైక్టర్‌ను నియమించింది. ఈ డెరైక్టర్‌ను కూడా విపత్తు నిర్వహణ ముఖ్యకార్యదర్శి కిందకు తెచ్చింది. (ఇప్పటి వరకూ విపత్తు నిర్వహణ కమిషనరే ఎక్స్‌అఫిషియో ముఖ్య కార్యదర్శి/ కార్యదర్శిగా ఉండేవారు) మొత్తం 26 మంది అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

వ్యవసాయ శాఖ నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఈనెల 7న బదిలీ అయిన అనిల్‌చంద్ర పునేఠాను తాజాగా రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)గా బదలాయించింది. ఇప్పటివరకూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నవారినే సీసీఎల్‌ఏగా నియమిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ముఖ్య కార్యదర్శిగా ఉన్న పునేఠాను ఈ స్థానంలో నియమించింది.

పదిరోజుల కిందటే పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌గా బదిలీ అయిన కె.కన్నబాబుకు మళ్లీ స్థానచలనం తప్పలేదు. ఆయన్ను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేసినట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వులో పేర్కొంది. బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 పేరు                                   ప్రస్తుత స్థానం                            బదిలీ అయిన స్థానం
 అనిల్ చంద్రపునేఠా                హోంశాఖ ముఖ్య కార్యదర్శి        సీసీఎల్‌ఏ
 జగదీష్ చంద్ర శర్మ             కార్మిక, ఉపాధి ముఖ్యకార్యదర్శి        రెవెన్యూ, విపత్తు శాఖల ముఖ్యకార్యదర్శి
 శాలినీ మిశ్రా                          వెయిటింగ్                           ప్రభుత్వరంగ సంస్థల ముఖ్యకార్యదర్శి
 డాక్టర్ విజయ్‌కుమార్                 వెయిటింగ్                    సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి
 జి.అనంతరాం                      రవాణాశాఖ కమిషనర్            కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల ముఖ్యకార్యదర్శి
 ప్రవీణ్‌కుమార్                      మత్స్యశాఖ కమిషనర్            బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి
 అనిల్‌కుమార్ సింఘాల్            ఓఎస్డీ, ఏపీ భవన్                రెసిడెంట్ కమిషనర్, ఏపీ భవన్
 బి.ఉదయలక్ష్మి                       వెయిటింగ్                    సాంకేతిక, కళాశాల విద్య కమిషనర్
 డి.కాడ్మియల్                      నీటిపారుదల శాఖ కార్యదర్శి        సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి
 కె.రాంగోపాల్                         వెయిటింగ్                    పౌరసరఫరాల సంస్థ ఎండీ
 బి.రామాంజనేయులు            కార్యదర్శి, వర్షాభావప్రాంతం        పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి కమిషనర్
 లవ్ అగర్వాల్                    వెయిటింగ్                     ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్(ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు)

 శశిభూషణ్‌కుమార్            గ్రామీణాభివద్ధి కమిషనర్        నీటిపారుదల శాఖ కార్యదర్శి
 కె.సునీత                          కళాశాల విద్య కమిషనర్            ఆర్థిక శాఖ కార్యదర్శి
 డి.వరప్రసాద్                    పంచాయతీరాజ్ కమిషనర్        కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల కమిషనర్
 రాంశంకర్ నాయక్               ఇంటర్‌బోర్డు కార్యదర్శి            మత్స్య శాఖ కమిషనర్
 ముఖేష్‌కుమార్ మీనా             వెయిటింగ్                    సాధారణ పరిపాలన(పొలిటికల్) కార్యదర్శి
 బి.శ్రీధర్                              వెయిటింగ్                    ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కార్యదర్శి
 సాల్మన్ ఆరోఖ్యరాజ్                 అనంతపురం కలెక్టర్            సెర్ప్ సీఈవో, ఆర్‌డీ ప్రత్యేక కార్యదర్శి    
 కోన శశిధర్                          ఈ-సేవ డెరైక్టర్                అనంతపురం కలెక్టర్
 హెచ్.అరుణ్‌కుమార్                 సీఈవో, సెర్ప్                తూర్పుగోదావరి కలెక్టర్
 పీఏ శోభ                               వెయిటింగ్                    ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి
 కె.ధనుంజయరెడ్డి                   సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్టు            విపత్తు నిర్వహణ శాఖ సంచాలకులు
 కె.కన్నబాబు                      పశ్చిమగోదావరి జేసీ            గుంటూరు కార్పొరేషన్ కమిషనర్
 ఎల్‌ఎస్ బాలాజీరావు               వెయిటింగ్                    ఐటీడీఏ పీవో, పార్వతీపురం
 పి.కోటేశ్వరరావు                     వెయిటింగ్                    పశ్చిమగోదావరి జేసీ

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న వాడరేవు వినయ్‌చంద్‌కు తిరుపతి పట్టణాభివద్ధి సంస్థ(తుడా) వైస్ చైర్మన్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

మరిన్ని వార్తలు