18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం  

13 Sep, 2019 19:29 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. 18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు.. అజయ్‌ జైన్‌- హౌజింగ్‌ ముఖ్య కార్యదర్శి.. శాంతిలాల్‌ దండే- పరిశ్రమలు, పెట్టుబడులు శాఖ కార్యదర్శి.. సిద్దార్థ జైన్- స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌, ఐజీ‌.. భాను ప్రకాష్‌- గిడ్డంగులు కార్పొరేషన్‌ వీసీఎండీ.. పి.ఉషాకుమరి- ఆయుష్‌ కుమార్‌, పి.ఎ.శోభ- గిరిజన సహాకార సంస్థ వీసీఎండీ.. టి. బాబురావు నాయుడు- పునరావాస ప్రత్యేక కమిషనర్‌.. కె.శారదాదేవి- మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్‌.. జి. రేఖా రాణి- కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

చెరుకూరి శ్రీధర్‌- ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ సెక్రటరీ.. ఎల్‌.ఎస్‌ బాలాజీ- మర్క్‌ఫెడ్‌, అగ్రోస్‌ ఎండీ.. ఎంఏ కిషోర్‌- కమిషనర్‌, రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌.. నందకిషోర్‌- ఎంగీ ఎపీటీఎస్‌.. డి. వాసుదేవ రెడ్డి- ఏపీ బేవరరేజస్‌ కార్పొరేషన్‌ వీసీఎండీ.. వి. రామకృష్ణ- స్పెషల్‌ కమిషనర్‌.. ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌.. ఎన్‌. చంద్రమోహన్‌ రెడ్డి- ఏపీ యుఎఫ్‌ఐడీసీ ఎండీ శాఖలకు బదిలీ చేశారు. కాగా జి. అనంతరామును సాధారణ పరిపాలనా శాఖ(జీఎడీ)కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు