రాష్ట్ర సాంకేతిక సమన్వయకర్తల నియామకం

2 Jun, 2020 10:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు, సమాచారంపై పర్యవేక్షణకు ఎనిమిది మందిని ‘స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లు’గా ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. వారిలో చేకూరి కిరణ్‌, జక్కం సుధాకర్‌రెడ్డి, మల్లాది సందీప్‌కుమార్‌, ఎ.లింగారెడ్డి, కేపీ ప్రసాద్‌రెడ్డి, ఐ.నారాయణరెడ్డి, జి.దశరథరామిరెడ్డి, వై.రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. వీరంతా నిరంతరం సమాచారం,కథనాలపై నివేదికలను రూపొందిస్తూ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో)కు ఎప్పటికప్పుడు నివేదిస్తారు. ఈ బృందం సభ్యులను గతంలో ‘సాంకేతిక సమన్వయకర్తలు’గా ప్రభుత్వం నియమించగా.. తాజాగా వారి పోస్టుల్ని ‘రాష్ట్ర సాంకేతిక సమన్వయ కర్తలు’గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  వీరంతా రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సీఈవో ఆధ్వర్యంలోని విభాగంలో పనిచేస్తారని ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో వెల్లడించింది.

మరిన్ని వార్తలు