టీటీడీ చైర్మన్‌గా సుధాకర్‌ యాదవ్‌?

30 Sep, 2017 02:27 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి:  టీటీడీ పాలక మండలి కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. పార్టీలోని కీలక నేతలతో సమావేశమై నూతన ట్రస్ట్‌ బోర్డుపై చర్చిస్తున్నారు. దసరాలోపే పాలక మండలిని ప్రకటించాలని మొదట నిర్ణయించినా పలు కారణా లతో అది సాధ్యంకాలేదు. దీంతో ట్రస్ట్‌బోర్డు లేకుండానే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

ఆదివారంతో ఇవి కూడా ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల లోపు పాలకమండలి నియామకం పూర్తయితే బ్రహ్మోత్సవాల సంబరం మరింత వేడుకగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తంకావడంతో సీఎం శుక్రవారం నుంచి దృష్టిసారించారు. తాజాగా వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేరు వినిపిస్తోంది. టీటీడీ ట్రస్ట్‌ బోర్డు నూతన చైర్మన్‌గా సుధాకర్‌యాదవ్‌ పేరు ఖరారైనట్లేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రసార మాధ్యమాల ద్వారా సీఎంకి సుధాకర్‌యాదవ్‌ ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే శుక్రవారం నుంచి మళ్లీ మదనపల్లికి చెందిన రవిశంకర్‌ పేరు వినిపిస్తోంది.  కాగా, సుధాక ర్‌యాదవ్‌ పేరు ఖరారు విషయంలో మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం దగ్గర వ్యూహాత్మకంగా చక్రం తిప్పారని వినికిడి. దీనికితోడు డీఎల్‌ రవీంద్రా రెడ్డికి మైదుకూరులో స్థానం కల్పించాలంటే సుధాకర్‌యాదవ్‌ను మరోచోటికి పంపించాలన్న ఆలోచన కూడా కారణమని ప్రచారం జరుగుతోంది.


తెలంగాణ నుంచి నలుగురికి..:
ఈసారి ట్రస్ట్‌ బోర్డు సభ్యుల్లో నలుగురు తెలం గాణ నేతలకు కూడా చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. చింతల రామచం ద్రారెడ్డి, సండ్ర వీరయ్యతో పాటు రేవంత్‌రెడ్డి, మరో నేత పేర్లు తెరమీదికొ స్తున్నాయి. అక్టోబర్‌ 2.. లేదా 5న నూతన పాలక మండలిని సీఎం అధికారి కంగా ప్రకటించే వీలుందని తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు