కరోనా కట్టడికి సమర్థవంతమైన చర్యలు : ధర్మాన

4 May, 2020 11:49 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని, ఎంత ఖర్చయినా ప్రభుత్వం వెనుకాడటం లేదని పేర్కొన్నారు. కరోనా అనుమానితులందరికీ ప్రభుత్వం పరీక్షలు చేసిందని, ప్రతిరోజు 6 వేల నుంచి 7 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నాని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు సక్రమంగా పనిచేస్తున్నాయని, వైద్యశాఖలో ఖాళీలనూ భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ధర్మాన.. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు బాగున్నాయని కేంద్రం ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. (ఎక్కడి వారక్కడే: సీఎం జగన్‌)

సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన ఆదర్శంగా ఉంది. రూ.౩ కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ నుంచి మత్స్యకారులను తీసుకొచ్చింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరు సరిగా లేదు. ప్రతి మంచి పనిని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో పసుపు చొక్కాల వారికే పనులు జరిగాయి. కానీ.. ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సాయం అందుతోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత ప్రతిపక్షాలకు లేదు. ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా ప్రతిపక్షాలు విజయం సాధించలేవు. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. మద్యంపై టీడీపీకి విమర్శించే హక్కు లేదు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబే. రాష్ట్రంలో దశలవారిగా మద్యం అమ్మకాలు నిషేధించడం జరుగుతుంది’ అని ధర్మాన స్పష్టం చేశారు.


 

మరిన్ని వార్తలు